Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
జాతిరత్నాలు దర్శకుడితో మెగా హీరో.. మరోసారి అలా సెట్ చేస్తున్న మహానటి డైరెక్టర్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జాతిరత్నాలు సినిమా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా దర్శకుడు KVఅనుదీప్ కు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. అయితే ఇక నెక్స్ట్ ఈ దర్శకుడు ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక మెగా హీరోతో కూడా చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది.
మరో లెవెల్ కు వెళ్లింది
దర్శకుడు అనుదీప్ షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ మంచి గుర్తింపు అందుకున్నాడు. ఉయ్యాల జంపాల సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుదీప్ అక్కడ నుంచి సురేష్ బాబు ప్రొడక్షన్ లో పిట్టగొడ సినిమా ద్వారా మొదటి డైరెక్షన్ ఛాన్స్ కొట్టేశాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో అతని స్థాయి మరో లెవెల్ కు వెళ్లింది.
స్టార్ హీరోల ప్రశంసలు
మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అనుదీప్ హాట్ టాపిక్ గా మారాడు. అగ్ర హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వాళ్ళు సినిమాను పొగడడమే కాకుండా స్పెషల్ గా దర్శకుడిపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అగ్ర హీరోలనే కాకుండా బడా నిర్మాతలను కూడా ఎట్రాక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మళ్ళీ అదే ప్రొడక్షన్ లో
జాతి రత్నాలు సినిమాను వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ లో నిర్మించిన విషయం తెలిసిందే. తొలిసారిగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించి సపోర్ట్ చేశాడు. అయితే సినిమా హిట్టవ్వడంతో మళ్ళీ వైజయంతి వారితోనే మరో సినిమా చేయడానికి అనుదీప్ కమిట్మెంట్ ఇచ్చాడు.
రామ్ అన్నారు?
ఇక నెక్స్ట్ ఈ కామెడీ డైరెక్టర్ దర్శకత్వంలో చేయబోయే హీరోలు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. మొదట రామ్ పోతినేని పేరు గట్టిగానే వినిపించింది. ప్రస్తుతం రామ్ తమిళ డైరెక్టర్ లింగుస్వామితో ఒక ద్విభాషా సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అనుదీప్ తో చర్చలు జరిగాయా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
వైష్ణవ్ తేజ్ కోసం స్టోరీ..
ఇక ఎప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కూడా ఒక సినిమా చేయవచ్చని టాక్ నడుస్తోంది. ఇటీవల ఉప్పెన సినిమాతో బిగ్ హిట్ అందుకున్న వైష్ణవ్.. క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను ఫినిష్ చేసిన విషయం తెలిసిందే. అలాగే సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు.
ఇక నాగ్ అశ్విన్ - వైష్ణవ్ తేజ్ మధ్య కాస్త సాన్నిహిత్యం ఉండడం వలన జాతిరత్నాలు దర్శకుడు ఒక స్టోరీ లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.