టాలీవుడ్‌లోకి మరో వారసుడు? హీరోగా లెజెండరీ నటి కుమారుడు!

చిత్ర పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా అందరూ తమ తర్వాత తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ వరకు ఈ కల్చర్ ఎప్పటి నుంచో వస్తున్నదే. స్టార్స్ నుంచి చిన్నచితకా హీరోల వరకు వారసుల లాంచింగ్ భారీ ఎత్తున జరుగుతోంది. అయితే వీరిలో ఇండస్ట్రీలో సెటిలైంది కొందరే. స్టార్ కిడ్స్‌గా ఎంట్రీ ఇచ్చిన వారు హీరోలుగా, హీరోయిన్లుగా నిలదొక్కుకునేందుకు చాలా శ్రమిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌కు చెందిన అలనాటి దిగ్గజ నటి తన కుమారుడిని హీరోగా పరిచయం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

దక్షిణాది నుంచి ఉత్తరాదిలో అడుగుపెట్టి టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన వారిలో జయప్రద కూడా ఒకరు. 80, 90 దశకాలలో భారతీయ చిత్ర పరిశ్రమను తన అందం, అభినయంతో ఏలారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, కమల్ హాసన్, అమితాబ్, రాజేష్ ఖన్నా, జితేంద్ర తదితర అగ్రనటుల సరసన నటించి మెప్పించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు జయప్రద.

Jaya Prada s Son Samrat to Enter Tollywood Soon with Grand Launch

భూమి కోసం అనే తెలుగు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత అంతులేని కథ, సిరిసిరి మువ్వ, అడవిరాముడు, యమగోల, ఏజెంట్ గోపీ, శ్రీవారి ముచ్చట్లు, సింహాసనం, సాగర సంగమం, తాండ్ర పాపారాయుడు తదితర సినిమాలలో నటించారు. 1979లో సర్గం అనే మూవీతో హిందీలో అడుగుపెట్టి ఉత్తరాది ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్‌గా మారారు. 1970-80 దశకాలలో హిందీ ఇండస్ట్రీని శ్రీదేవి, హేమామాలిని, రేఖలతో కలిసి ఏలారు జయప్రద. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన జయప్రద తెలుగు మహిళ అధ్యక్షురాలిగానూ పనిచేశారు.

ఆ తర్వాత సమాజ్‌వాది పార్టీలో చేరి 2004, 2009లలో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2019లో బీజేపీలో చేరారు. ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే శ్రీకాంత్‌కి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులతో జయప్రద ఆత్మహత్యాయత్నం చేయడం చిత్ర పరిశ్రమను కుదిపేసింది. అయితే పిల్లలు లేకపోవడంతో జయప్రద మానసికంగా కృంగిపోయారు.. తన సోదరి కుమారుడైన సిద్ధార్ధ్‌ అలియాస్ సామ్రాట్‌ను ఆమె దత్తత తీసుకుంది.

తాజాగా సామ్రాట్‌ను టాలీవుడ్‌లో హీరోగా లాంచ్ చేయాలని జయప్రద ప్లాన్ చేస్తున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ద్వారా సామ్రాట్‌ను పరిచేయం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తన కుమారుడి తొలి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ఇతర విషయాలను జయప్రద దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. ఇప్పటికీ హీరోకి కావాల్సిన డ్యాన్స్‌లు, ఫైట్స్, నటనలపై సామ్రాట్ శిక్షణ తీసుకున్నారు. భారీ బడ్జెట్, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో సామ్రాట్ లాంచింగ్ మూవీ ఉంటుందని సినీ జనాలు చెబుతున్నారు. హీరోయిన్ రోల్ కోసం ఓ ముగ్గురు టాప్ ముద్దుగుమ్మల పేర్లు పరిశీలనలో ఉన్నాయట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సామ్రాట్ ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

Read more about: jaya prada samrat movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X