పెళ్లైన స్టార్ హీరోతో సింగర్ అఫైర్?.. వీడియోతో రెడ్ హ్యాండెడ్‌గా దొరిన బ్యూటీ!
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా ఎఫైర్లు, బ్రేకప్ గురించిన వార్తలే వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్‌తో యంగ్ బ్యూటీ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందంటూ వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. వీరిద్దరూ సుదీర్ఘంగా రిలేషన్‌లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే సన్నిహితులు మాత్రం సుమంత్ - మృణాల్ మధ్య అలాంటి రిలేషన్ లేదని తేల్చేశారు. తాజాగా కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన జయం రవి
ఒకే హీరో గురించి పలుమార్లు గాసిప్స్ రావడం చాలా అరుదు. ఒకదాని వెంట మరొకటి ఇలాంటి పుకార్లు వస్తుంటే అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు కోలీవుడ్ హీరో జయం రవి. నిర్మాత, దర్శకుడు ఎడిటర్ మోహన్ కుమారుడే జయం రవి. తండ్రి నిర్మాత కావడంతో చిన్న వయసులోనే బాలనటుడిగా బావబావమరిది, పల్నాటి పౌరుషం వంటి చిత్రాల్లో నటించారు. నళిని భాస్కరన్ వద్ద 12 ఏళ్ల వయసులోనే భరత నాట్యం తీసుకున్న జయం రవి గ్రాడ్యుయేషన్ తర్వాత జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు.

వరుస సినిమాలతో జయం రవి
తర్వాత దాస్, మేఘై, ఇదయ తిరుందన్, ఉనక్కుమ్ ఎనక్కుమ్ చిత్రాలతో వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకుని స్టార్ రేసులో దూసుకొచ్చాడు. తెలుగులో జెండాపై కపిరాజు సినిమాలో గెస్ట్ రోల్ చేసి తెలుగువారిని పలకరించారు. మంచి స్క్రిప్ట్ కథ దొరికితే ఖచ్చితంగా తెలుగు సినిమా చేస్తానని జయం రవి పలుమార్లు తెలిపారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ మూవీ పొన్నియన్ సెల్వన్ సిరీస్‌లో ప్లేస్ దక్కించుకున్నారు. గతేడాది బ్రదర్ సినిమాతో పలకరించిన జయం రవి.. ప్రస్తుతం కరాటే బాబు, పరాశక్తి, జినీ, తనీఓరువన్ 2 చిత్రాలలో నటిస్తున్నారు.
ఆర్తితో జయం రవి విడాకులు
గత కొద్దినెలలుగా వ్యక్తిగత జీవితంలో జయం రవి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తన భార్య ఆర్తితో ఆయన విడాకులు తీసుకున్నారు. 2009లో ఆర్తి - జయం రవిల వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారుడు ఆరవ్, ఆయాన్. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకడం రవి అభిమానులను, సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. ఏ కారణం చేత వీరిద్దరూ విడిపోయారనేది తెలియరాలేదు.. ఈ జంట కూడా ఈ విషయం వెల్లడించలేదు.
ప్రియాంక మోహన్‌తో రిలేషన్‌తో?
అయితే ఆర్తితో విడాకులైన సమయంలోనే హీరోయిన్ ప్రియాంక మోహన్‌తో జయం రవి రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు రావడం కలకలం రేపింది. వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లుగా ఉన్న ఫోటోలు బయటకు రావడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. దీనిపై రవి- ప్రియాంక స్పందించారు. ఆ ఫోటోలు తాము నటించిన బ్రదర్ చిత్రంలోనివని.. అంతే తప్పించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు.
కేనిషాతో క్లోజ్‌గా జయం రవి
ప్రియాంక ఎపిసోడ్ ముగిసిన తర్వాత సింగర్ కేనిషా ఫ్రాన్సిస్‌తో జయం రవి డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై కేనిషా స్పందించారు. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను స్వతహాగా థెరపిస్ట్ కావడంతో మానసిక సమస్యల్లో ఉన్న జయం రవికి చికిత్స అందించానని తెలిపారు. ఆర్తి, అతని కుటుంబ కారణంగా రవి బాగా ఇబ్బందిపడ్డాడని, ఎంతో కృంగిపోయాడని కేనిషా వెల్లడించారు. కేవలం వృత్తిపరంగానే తాము కలిశామని అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏం లేదని ఆమె స్పష్టం చేశారు.
పెళ్లి వేడుకలో జంటగా రవి - కేనిషా
అయితే అనూహ్యంగా కేనిషా - జయం రవిలు జంటగా ఓ కార్యక్రమంలో కనిపించారు. వేల్స్ యూనివర్సిటీ ఛైర్మన్ గణేష్ కుమార్ కుమార్తె పెళ్లి వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రవితో కలిసి కేనిషా ఫ్రాన్సిస్ హాజరై ఒకే సోఫాలో కనిపించడంతో కోలీవుడ్‌లో వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మా మధ్య కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందన్న రవి- కేనిషాలు ఇలా జంటగా కనిపించడంతో రూమర్స్ బయల్దేరాయి. మరి ఈసారి వీరిద్దరూ ఏం చెబుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











