'తీన్ మార్'విషయమై దర్శకుడుకీ, పవన్ కీ గొడవ?

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ విషయమై జయంత్,పవన్ కళ్యాణ్ గొడవపడుతున్నారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.అది రూమరా లేక నిజమా అన్న విషయం ప్రక్కన పెడితే వారు చెప్పుకునే దాని ప్రకారం ఈ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు పవన్ కల్యాణ్ చాలా అసంతృప్తి ఫీలయ్యాడని,జయంత్ దర్శకత్వం మరీ బావగారు బావున్నారా కాలం దగ్గరే ఆగిపోయిందని,కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించటంలేదని,అది ఎంతవరకూ ఈ కాలం యూత్ కి ఎక్కుతుందని అనుమానం వ్యక్తం చేసాట్ట.అంతేగాక ఈ చిత్రానికి డైలాగులు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ని చిత్రంలోని కీలకమైన సన్నివేశాలు డైరక్ట్ చేయమని కోరటం, అతను చేయటం జరిగిందిట.

చిత్రంలోని మినిమం 14 సీన్స్ వరకూ త్రివిక్రమ్ డైరక్ట్ చేసాడని వినికిడి.దాంతో అతను పేరు కూడా దర్శకత్వం క్రింద వేయాలని పవన్ పట్టుబడుతున్నాట్ట.జయంత్ ఈ విషయమై ఏం చేయాలో పాలుపోక ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఫిల్మ్ ఛాంబర్ ని కాని,లీగల్ గా గానీ ఎప్రోచ్ కావాలని ఆలోచనలో ఉన్నాడని చెప్తున్నారు. తీన్ మార్ చిత్రం ఈ నెల 14 వ తేదిన విడుదల చేయనున్నట్లు నిర్మాత గణేష్ బాబు ప్రకటించారు. పవన్‌కళ్యాణ్ ఈ చిత్రంలో అర్జున్ పాల్వాయ్, మైఖేల్ వేలాయుధం పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X