మహేష్ చిత్రంలో జయప్రద హైలెట్
మహేష్ బాబు తాజా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పాపులర్ యాక్ట్రెస్, రాజ్యసభ మెంబర్ అయిన జయప్రద నటించనుంది. చిత్రంలో ఆమె పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు చెప్తున్నారు. ఆమెను వెంకేటష్, మహేష్ లకు తల్లిగా తీసుకుంటున్నారు. తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. కొత్త బంగారులోకం చిత్రంతో పరిచయమైన అడ్డాల శ్రీకాంత్ డైరక్ట్ చేస్తున్నారు. మొదట ఈ పాత్రకు గాను జయసుధను అనుకున్నారు. కానీ జయసుధ కంటిన్యూగా తల్లి పాత్రలు చేస్తూంటే మొనాటని వస్తుందనే ఫీలింగ్ తో ఆమెను తీసుకుంటున్నట్లు చెప్తున్నారు.
ఇక డిసెంబర్ నెల నుంచే సినిమా రెగ్యులూర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా...ఈ చిత్రం జనవరి 18కి వాయిదా పడింది. ఇందుకు కారణం హీరోయిన్ సమంత డేట్స్ దొరకకపోవటమేనని తెలుస్తోంది. దాంతో ఆమె బదులుగా వేరే హీరోయిన్ వేటలో నిర్మాతలు ఉన్నారు.మిక్కీజె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కోస్టార్స్ గా నటిస్తున్న వెంకీ, మహేష్ బాబులు సంక్రాంతి బరిలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వెంకటేష్ నటించిన బాడీగార్డు, మహేష్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సంక్రాంతి పండగ సందర్భంగా ఒకే సారి విడుదల అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











