మహేశ్ బాబు తండ్రిగా సీనియర్ హీరో: ‘సర్కారు వారి పాట’ కోసం దింపుతున్నారు

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం అతడు కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాంతో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి 2020లోనే ఈ మూవీకి సంబంధించిన ప్రకటన చేసినప్పటికీ.. ఈ ఏడాది ప్రారంభంలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. కన్నడ పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో జయరాం.. 'సర్కారు వారి పాట'లో నటిస్తున్నాడట. అది కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు తండ్రి పాత్రలో అని అంటున్నారు. ఈ సినిమాలో అతడు బ్యాంకు మేనేజర్‌గా నటించబోతున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. హీరో తండ్రిని మోసం చేసి వేరే దేశానికి పారిపోయిన ఓ బడా వ్యాపారవేత్తపై ప్రతీకారం తీర్చుకోవడం అనే కాన్సెప్టుతో ఈ మూవీ రూపొందుతోంది. విదేశాల్లో దాక్కున ఆ బిజినెస్ మ్యాన్‌ను ఇండియా తీసుకొచ్చి తన తండ్రి పేరు నిలబెట్టేందుకు హీరో చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ అని టాక్.

 Jayaram to play Mahesh Babu Father role in Sarkaru Vaari Paata

దుబాయ్‌లో 'సర్కారు వారి పాట' మొదటి షెడ్యూల్‌లో మహేశ్ ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. అలాగే, హీరో హీరోయిన్ల కాంబినేషన్ సీన్స్ కూడా షూట్ చేశారు. ఇక, మార్చి చివర్లో మరో షెడ్యూల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ దీనికి సంగీతం సమకూర్చుతున్నాడు. 2022 సంక్రాంతికి ఇది విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X