»   » ‘రౌడీ’లో మోహన్ బాబుపై రీమిక్స్ సాంగ్

‘రౌడీ’లో మోహన్ బాబుపై రీమిక్స్ సాంగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మోహన్ బాబు - మంచు విష్ణు ప్రధాన పాత్రల్లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రౌడీ'. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రంలో ఓ రీమిక్స్ సాంగ్ ఉందని సమాచారం. మోహన్ బాబు, జయసుధలపై ఈ పాటని చిత్రీకరించారని తెలుస్తోంది. ఈ పాట మరేదో కాదు...రంగీలా పాట రీమిక్స్. ఈ విషయాన్ని జయసుధ ఖరారు చేసారు.

జయసుధ మాట్లాడుతూ..., " ఈ సినిమాలో చాలా ఎక్సైటింగ్ పార్ట్ ఏమిటీ అంటే నేను చాలా కాలం తర్వాత ఓ పాటకు డాన్స్ చేయటం. పాట అవుట్ పుట్ చాలా అద్బుతంగా వచ్చింది. నేను చాలా థ్రిల్ అయ్యాను. నేను ఇప్పటికీ నమ్మలేకున్నా నేనే ఆ పాటను చేసేనంటే. నా అభిమానులకు తప్పకుండా ఆ పాట నుచ్చుతుంది " అన్నారు.

Jayasudha dancing with Rowdy for Rangeela song

మోహన్ బాబుకి జోడీగా జయసుధ నటించనున్న ఈ సినిమాలో మంచు విష్ణు సరసన శాన్వి హీరోయిన్ గా కనిపించనుంది. ఏవి పిక్చర్స్ బేనర్లో పార్థ సారథి, గజేంద్ర, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ యాక్షన్ అండ్ పొలిటికల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.

ఎమోషన్ సీన్లతో పాటు హై ఓల్టేజ్ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. సినిమాలో మోహన్ బాబు పెద్ద కుమారుడుగా కన్నడ కిషోర్, రెండవ కుమారుడుగా మంచు విష్ణు నటిస్తున్నట్లు సమాచారం. వర్మ కు అత్యంత ఇష్టమైన గాడ్ ఫాధర్ పోలికలతోనే ఈ చిత్రం తెరకెక్కుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. రిలీజైన ఫస్ట్ లుక్ ఫోటోలు చిత్రంపై క్రేజ్ ని క్రియేట్ చేస్తున్నాయి.

English summary
The biggest highlight of the RGV Rowdy film is touted to be Mohan Babu and Jayasudha dancing on a remix of Rangeela’s title song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X