జెడి చక్రవర్తి ఆ స్టార్ హీరోని డైరక్ట్ చేయనున్నారా?
త్వరలో జెడి చక్రవర్తి దర్సకత్వంలో తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించనున్నారని తెలుస్తోంది. అలాగే ఆ చిత్రంలో మరో హీరోగా నేను దేవుడ్ని ఫేం ఆర్య (వరుడు ఫేమ్) కూడా చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని గతంలో సర్వం చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు నిర్మిస్తారు. ఇక తెలుగులో జెడి చక్రవర్తి..హోమం, సిద్దం చిత్రాలను డైరక్ట్ చేసారు. జెడి చక్రవర్తి ప్రస్తుతం తెలుగు లో మనీ మనీ మోర్ మనీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే జెడి నటుడుగా 'కాంట్రాక్ట్' అనే చిత్రంలో చేస్తున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి కాంబినేషన్‌లో త్వరలో ఈ 'కాంట్రాక్ట్' టైటిల్ తో ఓ చిత్రం రూపొందనుంది. వర్మ కార్పొరేషన్‌లో జెడి చక్రవర్తి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన ఎస్.ఎస్.సమీర్ నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించనున్నారు. ఈ చిత్రం గురించి సమీర్ మాట్లాడుతూ-యాక్షన్ బేసెడ్ ప్రేమకథ ఇది. దేశ విదేశాల్లో విభిన్న ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ చేస్తాం. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలవుతుంది.


Click it and Unblock the Notifications











