‘రంగం’ జీవా - అక్కినేని కాంబినేషన్?
'రంగం" సినిమా ద్వారా తెలుగు ప్రేక్షులను ఆకట్టుకున్న హీరో జీవా. తాజాగా అందిన సమచారం ప్రకారం జీవా త్వరలో లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి స్ర్కీన్ పంచుకోబుతున్నారని చెన్నయ్ వర్గాల సమాచారం. జీవా హీరోగా తమిళంలో 'ముగముడి" అనే సినిమా రూపొంద బోతోంది. ఈ సినిమాకు మైస్స్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అక్కినేని పర్మినెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ రాజ్ కూడా మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.
ఈ ఇద్దరు స్టార్లతో తెరను పంచుకోవడంపై జీవా చాలా సంతోషంగా ఉన్నాడని తమిళ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. యూటీవీ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జీవా సూపర్ హీరో పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాకోసం దాదాపు 10 కేజీల బరువు పెరిగి కండలు పెంచాడట జీవా. జీవా సరసన హీరోయన్ గా పూజా హెడ్జ్ నటిస్తుండగా, నారాయణ్ విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగులోనూ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











