రాజశేఖర్ దంపతులకు ఊహించని షాక్... ఆ ఇద్దరి తగాదాతో అసంతృప్తి
టాలీవుడ్‌లో రాజశేఖర్, జీవిత దంపతుల టైమ్ బ్రహ్మండంగా నడుస్తున్నది. గతేడాది నుంచి వారి కెరీర్ , ఆర్థిక విషయాలు కాస్త మెరుగుపడినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తున్నది. అంతేకాకుండా ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ఈ స్టార్ దంపతులకు ఊహించని విజయం దక్కింది. అయితే కూతుళ్లు శివానీ, శివాత్మిక విషయంలో ఊహించినట్టు జరగకపోవడం వారికి కొంత అసంతృప్తికి లోనైనట్టు సినీ వర్గాల్లో టాక్ వినపడుతున్నది. వివరాల్లోకి వెళితే

మా ఎన్నికల్లో విజయం
టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా జరిగిన మా ఎన్నికల్లో ఇటీవల హీరో రాజశేఖర్ ఫ్యామిలీ ఉత్సాహంగా పాల్గొన్నది. తన తల్లిదండ్రులు విజయానికే కాకుండా సొంత ప్యానెల్ అభ్యర్థుల విజయాలకు రాజశేఖర్ కూతుళ్లు తమ వంతు సహాయాన్ని అందించారు. అంతేకాకుండా ప్యానల్ గెలుపులో కీలకంగా వ్యవహరించడం సినీ వర్గాల నుంచి మంచి స్పందన వ్యక్తమైంది.

శివానీ రాజశేఖర్‌కు బ్రేక్
రాజశేఖర్ తమ కూతుళ్లను సినీ పరిశ్రమలో రాణించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 2 స్టేట్స్ సినిమాను రీమేక్‌గా చేసి శివానిని హీరోయిన్‌గా నటింపజేయాలని అనుకొన్నారు. రాజమౌళి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో రాజశేఖర్ దంపతులకు అసంతృప్తిని కలిగించింది.

క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా
హీరో అడివి శేషు, డైరక్టర్‌కు మధ్య క్రియేటివ్ విభేదాలు తలెత్తడంతో 2 స్టేట్స్ రీమేక్ ఆగిపోయింది. దాంతో శివానీ టాలీవుడ్ ఎంట్రీ నిలిచిపోవడంతో రాజశేఖర్ దంపతులు కొంత నిరాశకు గురైనట్టు సమాచారం. దాంతో శివానీ ఎంట్రీ కోసం మరో సినిమాకు ఎదురుచూస్తున్నారు.

శివాత్మికకు లైన్ క్లియర్
అయితే రాజశేఖర్ దంపతులకు శివాత్మిక కొంత ఉపశమనం కలిగించింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న దొరసాని విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది. తన అక్క కంటే చెల్లెలే సినిమా ఇండస్ట్రీలో ఊహించని విధంగా కాలుపెట్టడం వారి ఆనందానికి కారణమైంది.

మళ్లీ రాజకీయాలతో గందరగోళం
ఇలా సవ్యంగా సాగిపోతున్న సమయంలో రాజశేఖర్ దంపతులు మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, వైసీపీకి మద్దతు తెలపడంపై ఇండస్ట్రీలో ఓ వర్గం గుర్రుగా ఉందట. తమకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌తో జతకలిసి పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం, అలాగే టీడీపీ తీవ్రమైన ఆరోపణలు చేయడంపై కొందరు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే సమయం కోసం మరోసారి రాజశేఖర్ దంపతులకు చెక్ పెట్టాలని అడుగులేస్తున్నారట.


Click it and Unblock the Notifications











