33 ఏళ్ళ తరువాత మళ్ళీ వెండితెరపై జీవితా రాజశేఖర్.. ఆ అగ్ర హీరో సినిమాలో గోల్డెన్ ఛాన్స్!
నటిగానే కాకుండా నిర్మాతగా దర్శకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న జీవిత రాజశేఖర్ అలాగే రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు హడావిడిగా కనిపిస్తూ ఉంటారు. ఇక సెన్సార్ యూనిట్ బోర్డులో కూడా ఆమె కీలక సభ్యురాలిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఇక మా ఎలక్షన్ సమయంలో కూడా జీవిత రాజశేఖర్ చాలా హైలైట్ అయ్యారు. ఇక ఇటీవల కాలంలో జీవిత రాజశేఖర్ మళ్ళీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
1984లో ఒక తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జీవిత రాజశేఖర్ ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపును అందుకుంది. అయితే తెలుగులో కంటే ఆమెకు అప్పట్లో ఎక్కువగా తమిళంలోనే అవకాశాలు వచ్చాయి. దాదాపు 16 ఏళ్ల పాటు ఆమె హీరోయిన్ గా చాలా బిజీగా కనిపించింది. ఇక హీరోయిన్ గా ఆమె రేంజ్ పెరిగిన తర్వాత రాజశేఖర్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు.

చివరిగా 1990లో రాజశేఖర్ తోనే మగాడు అనే సినిమా చేశారు. మళ్లీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వచ్చిన కూడా ఎందుకో నటన వైపు ఆసక్తిని చూపలేదు. కానీ నిర్మాతగా దర్శకురాలిగా మాత్రం ఆమె ఇండస్ట్రీలో బిజీగా కనిపించారు. ముఖ్యంగా రాజశేఖర్ తో శేషు ఆప్తుడు సత్యమేవ జయతే గడ్డం గ్యాంగ్ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. వారి కూతుళ్లు ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇక జీవిత రాజశేఖర్ ఇప్పుడు మళ్లీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. లాల్ సలాం అనే ఆ సినిమాలో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నట్లు టాక్ కూడా వినిపిస్తోంది. ఇక మార్చి 7 నుంచి మొదలు కాబోయే ఈ సినిమా షూటింగ్లో జీవిత కూడా జాయిన్ కాబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











