జీవిత మళ్లీ వేలు పెడుతోందా...కష్టమే
హైదరాబాద్ : హీరో రాజశేఖర్ సినిమాలు కొన్నిటిని భార్య జీవిత డైరక్ట్ చేసింది. అయితే అవేమీ ఆడలేదు. అయినా ఆమె ప్రయత్నాలు మానలేదు. ఓ రకంగా రాజశేఖర్, భార్య జీవిత ఇన్వాలమెంట్ ఎక్కవ అవటంతో దర్శకులు ఎవరూ రాజశేఖర్ తో సినిమా చేయటానికి ఆసక్తి చూపటం లేదని కొంతకాలంగా వినపడుతోంది. అయితే అవేమీ లెక్కచేయకుండా ఘోస్ట్ డైరక్షన్ కి సైతం సిద్దమవుతోంది జీవిత. తాజాగా ఆమె గెడ్డం గ్యాంగ్ ని సైతం ఘోస్ట్ డైరక్షన్ చేసేస్తోందని ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే తమ సొంత సినిమా కాబట్టి స్క్రిప్టులో మార్పులు మాత్రమే చేస్తోందని మరికొందరు అంటున్నారు.
డబ్బులు పెట్టేది వాళ్లు....తమ సొంత సినిమా తమ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటారు..స్క్రిప్టు మార్చుకుంటారు, ఘోస్ట్ డైరక్షన్ చేసుకుంటుంది మీకేంటి నష్టం అంటే కొత్త దర్శకుడు ఈ సినిమాతో తన కెరీర్ కు ఓ మార్గం వేసుకోవాలని భావిస్తున్నాడు. అతను బలైపోతాడు అని సానుభూతి చూపెడుతున్నారు. అయితే ఇదంతా ఓ వర్గం చేస్తున్న ప్రచారంగా యూనిట్ కొట్టిపారేస్తోంది. తమిళంలో విజయం సాధించిన 'సూదుకవ్వుమ్'కిది రీమేక్. జీవితా రాజశేఖర్ నిర్మాత. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

రాజశేఖర్ మాట్లాడుతూ.... ''గడ్డం దాస్ అనే వ్యక్తి జీవితంలో జరిగే మలుపులే ఈ చిత్రం. ఇందులో నాతో పాటు మరో నలుగురు యువ నటులు చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లోకెల్లా ఇది వైవిధ్యంగా ఉంటుంది'' అన్నారు. జీవిత మాట్లాడుతూ ... ''సూదుకవ్వుమ్' సినిమాను తెలుగులో చాలా మంది చేద్దామనుకున్నారు. ఆఖరికి ఆ అవకాశం మాకు దక్కింది. 35 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... ''తొలి సన్నివేశం నుంచి కొత్తదనం కూడుకున్న కథ ఇది. రాజశేఖర్ నటన, షీనా అందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు దర్శకుడు. నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. చిత్రానికి ఛాయాగ్రహణం: డేమిల్ గ్జావియర్ ఎడ్వర్డ్స్, సంగీతం: అచ్చు. కళ: వెంకట్, ఛాయాగ్రహణం: రిచర్డ్ కెవిన్


Click it and Unblock the Notifications











