»   » చిరంజీవి పై మహాకాంళి అవతారమెత్తుతున్నమహా స్టార్....

చిరంజీవి పై మహాకాంళి అవతారమెత్తుతున్నమహా స్టార్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి అంటే ఒంటి కాలి మీద లేచే మహాస్టార్ రాజశేఖర్ కి బ్లడ్ బ్యాంక్ మీద ఆరోపణలు చేసిన కారణంగా ఇటీవలే కోర్టు నుంచి నోటీసులందాయి. చిరంజీవి వంటి వ్యక్తిపై అకారణంగా నిందలు వేసినందుకు ప్రజారాజ్యం నేత ఒకరు రాజశేఖర్ పై పరువు నష్టం దావా వేశారు. దీనిపై పబ్లిక్ గా స్పందించని రాజశేఖర్ ఇక మెగా ఎటాక్ కి వెండితెరనే వేదికగా చేసుకుంటున్నాడు. రాజశేఖర్ హీరోగా రూపొందుతోన్న 'మహంకాళి" చిత్రంలో రాజకీయ నేతగా మారే సినిమా స్టార్ క్యారెక్టర్ ఒకటి రాయించాడట.

చిరంజీవి నిజ జీవితానికి సంబంధించిన పలు సంఘటనలను ఈ చిత్రంలో ప్రస్తావించబోతున్నాడట. పోలీస్ కథ కావడంతో సదరు చిరంజీవి క్యారెక్టర్ రాజశేఖర్ ఓ రేంజ్ లో రెచ్చిపోతాడట. టీవీల్లో వచ్చి ఎన్నిసార్లు గొంతు చించుకున్నా ప్రయోజనం లేదని, ఇలా సినిమా తీస్తే కానీ చిరంజీవిపై తన పగ చల్లారదని రాజశేఖర్ అంటున్నాడట. అయితే ఇప్పటికే చిరంజీవి విషయంలో చాలా ఎక్కువ చేసిన రాజశేఖర్ దానిని ఇంతటితో ఆపేస్తే బాగుంటుందని, ఇలా ఇంకా రెచ్చగొట్టడం వల్ల అతనే చులకన అవుతున్నాడని సన్నిహితులు. ఈ మాటలు విని అయినా తన ఆలోచన మార్చుకుంటాడో లేక చిరంజీవి నామ స్మరణలోనే తరించిపోతాడో చూడాలి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu