»   » చిరంజీవి ‘బ్లడ్ బ్యాంక్’కి ఎసరు పెట్టనున్న జీవిత రాజశేఖర్...

చిరంజీవి ‘బ్లడ్ బ్యాంక్’కి ఎసరు పెట్టనున్న జీవిత రాజశేఖర్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అదే పనిగా టీవీల్లో కనపడిన ఆరోపణలు చేస్తుండేసరికి రాజశేఖర్ దంపతులపై చిరంజీవి పరువు నష్టం కేసు పెట్టించారు. డైరెక్ట్ ఎటాక్ చేస్తే తమపైనే రివర్స్ ఎటాక్ జరుగుతుందని భయపడి రాజశేఖర్, జీవిత ఇప్పుడు చిరంజీవి ఊసెత్తడం మానేశారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్న తమకి కొత్తగా చిరంజీవి పరువుకి ఖరీదు కట్టే స్తోమత లేకపోవడంతో సైలెంటయ్యారు. అయితే చిరంజీవి అన్నా, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్నా తమకి చాలా ఇష్టం కాబట్టి దాని గురించి తమకి తెలిసిన నిజాలు ప్రజలకి చేరవేయడానికి వారు కొత్త మార్గం వెతుక్కున్నారు.

త్వరలో 'బ్లడ్ బ్యాంక్" పేరుతో రాజశేఖర్ ఒక చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ని కమర్షియలైజ్ చేసి ఎలా పేదల రక్తంతో వ్యాపారం చేస్తున్నారనేది విపులంగా చూపించనున్నారు. ఈ చిత్రానికి ఫండ్ అంతా కూడా ఇటీవలే ఒక పెద్ద పార్టీ నుంచి వేరుపడి కొత్త కుంపటి పెట్టుకున్న ఓ యువనేత పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu