‘లోకనాయకుడు’ గా వైఎస్ఆర్ జీవిత చరిత్ర
వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం ఆంధ్ర ప్రజలను తీవ్రదిగ్ర్భాంతికి గురి చేసింది. చిత్ర పరిశ్రమ వారు కూడా సంతాప సభల ఏర్పాటు చేసి నివాళులర్పిస్తున్నారు. ప్రజా భాందవుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నివాళిగా 'లోకనాయకుడు" లైటిల్ తో ఒ సినిమా తెరకెక్కిస్తానని హీరో రాజశేఖర్ చెబుతున్నాడు. వైఎస్ జీవిత చరిత్ర మీద సినిమా తీస్తానని ప్రకటించిన రాజశేఖర్, అంతలోనే టైటిల్ ని కూడా ఫిక్ప్ చేసేసుకున్నాడు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ చేపట్టిన పాదమత్ర నుంచి మొత్తం ఆయన జీవిత విశేషాల్ని స్ఫురించేలా సినిమా వుంటుందని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.
సబ్జెక్ట్ వర్క్ మొదలు పెట్టేశామనీ, కమర్షియల్ అంశాల్ని జొప్పించి తెరకెక్కిస్తామనీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి 'లోకనాయకుడు" టైటిల్ పెర్ ఫెక్ట్ గా సూటవుతుందని జీవిత, రాజశేఖర్ అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి జీవిత, రాజశేఖర్ పూర్తి వివరాల్ని వెల్లడించనున్నారట.


Click it and Unblock the Notifications











