చిరంజీవి స్నేహం కోసం తహతహలాడుతున్న జీవితారాజశేఖర్..!
వైయస్ తమకి ఏదో పెద్ద పదవి కట్టబెట్టేస్తాడనే ఆశతో చిరంజీవిపై లేనిపోని విమర్శలు చేసి పబ్లిక్ లో చులకన అయిన రాజశేఖర్, జీవితలకి చివరకు ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ప్రభుత్వంలో ఏదో ఒక ప్రయోజనకరమైన పోస్ట్ లభిస్తుందని చూసిన విరికి చివరకు వ్యక్తిగత ప్రతిష్టతకి భంగం కలిగించినందుకు కోర్టు కేసులు మిగిలాయే తప్ప మరే విధమైన లాభం చేకూరలేదు. మరో వైపు చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన వ్యక్తి అయిపోయాడు. తలుచుకుంటే ఇప్పుడు చిరంజీవి ప్రభుత్వ అండతో తమని ఏమైనా చేయగలడు అనుకున్నారో ఏమో?పాపం..చిరంజీవి పవర్ ఏమిటనేది అర్థమైన రాజశేఖర్ దంపతులు ఇప్పుడు అతనితో రాజీ కోసం చూస్తున్నారు. గతంలో చిరంజీవితో సత్సంబంధాలున్న వారు ఇప్పుడు మళ్లీ అదే సఖ్యత కావాలంటూ పరితపిస్తున్నారు. అయితే తన పరువుని బజారున పడేసిన వారిలో కీలక పాత్ర పోషించిన వీరిపై చిరంజీవి ఏమాత్రం దయ చూపిస్తాడో వేచి చూడాల్సిందే....


Click it and Unblock the Notifications











