జీవిత రాజశేఖర్ టార్గెట్ ఇప్పుడు చిరు కాదు ‘బాబు’
జీవిత రాజశేఖర్ దంపతులు మీడియా ముందుకు వచ్చారంటే చిరంజీవి మీద బురద చల్లటానికి అనే అందురు అనుకుంటారు. అలానే రాజశేఖర్ మళ్ళీ మీడియా ముందుకురాగనే ఈసారి చిరు మీద నోరు పారేసుకోవటానికి అనుకున్నవారికి షాక్ ఇస్తూ ఈసారి చంద్రబాబును టార్గెట్ చేసుకున్నాడు. ప్రత్యేక తెలంగాణ పై చంద్రబాబు తెలంగాణ విషయంలో దాగుడుమూతలు ఆడి జనానికి లోకువ అయ్యాడు. అదీ చాలదన్నట్టు రాజకీయనాయకులు, రిలయన్స్ పై దాడుల పుణ్యమా అని మీడియా కూడా బాబును దొబ్బి వదులుతుంది ఇప్పుడ. ఇది చాలదన్నట్టు ఇప్పుడు రాజశేఖర్ కూడా బాబును తూర్పారబట్టాడు సినిమా యాక్టర్ అయిన తనే తెలంగాణ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని మీడియా ముందుకు వచ్చి చెబుతుంటే తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రి గా చేసిన బాబుకు ఆ మాత్రం బాధ్యత లేదా అని ప్రశ్నించారు.
అయిన దానికి కానిదానికి బాబుకు జగన్ మీద పడి ఏడ్వటం బాగా అలవాటుఅయ్యిందని వైయస్ మీద అభిమానంతో ప్రజలు రిలయన్స్ ఆస్తులపై దాడులు చేస్తే వారించాల్పింది పోయి జగన్ పై బురద జల్లటం ఏంటని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడ కేసిఆర్ చేతిలోనో లేదా మరే నేత చేతిలోనో లేదని అది ప్రజల చేతుల్లో ఉందని ఇప్పుడు చేయాల్సింది ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నది తెలుసుకోవటం అని రాజశేఖర్ పేర్కొన్నారు. మొత్తం మీద ఇప్పుడు రాజశేఖర్ టార్గెట్ మారనందువల్ల చిరు కాస్త హ్యాపిగా ఉండి ఉంటాడనుకోవచ్చు.


Click it and Unblock the Notifications











