twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్ చిత్రం నుంచి కాజల్ ని తీసేసి ఆమెకి ఆఫర్!?

    By Srikanya
    |

    దశరధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మించనున్న చిత్రంలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా తెలిసిన దాన్ని బట్టి ఆ చిత్రాన్ని కాజల్ చేయటం లేదు. దిల్ రాజు...రెమ్యునేషన్ దగ్గర బేరం ఆడటంతో ఈ మార్పు చోటు చేసుకున్నట్లు సమాచారం. అలాగే ప్రభాస్ తో చేసిన డార్లింగ్ పెద్దగా వర్కవుట్ కాకపోవటం కూడా సెంటిమెంటల్ గా ఈ నిర్ణయం తీసుకున్నారని మరో టాక్ వినిపిస్తోంది. ఇక కాజల్ ప్లేసులో ఝుమ్మంది నాదం హీరోయిన్ తాప్సిని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఈ విషయం తాప్సి తాజాగా ట్విట్టర్ లో కన్పర్మ్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. కాబట్టి మొదటి హీరోయిన్ ఛాన్స్ ఎవరు తీసుకుంటారు. తాప్సీ ఫస్టా..సెకెండా అనేది తేలాల్సి ఉంది. జూన్ తొమ్మిదిన ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ కానుంది. ప్రస్తుతం కాజల్ ఎనభై లక్షలు నుంచి కోటి దాకా రెమ్యునేషన్ డిమాండ్ చేస్తున్నట్లు అంతర్గత సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X