జేఆర్‌డి టాటా జీవితంపై సినిమా, హీరో ఎవరంటే?
ముంబై: జాన్ అబ్రహ్మం....బాలీవుడ్లో క్రమక్రమంగా తన ఇమేజ్ పెంచుకుంటున్న స్టార్. టాలెంటెడ్ హీరోగా...సెన్సబుల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా బాలీవుడ్ నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే....జాన్ అబ్రహ్మం టాటా సంస్థల అధినేతల్లో ఒకరైన జేఆర్‌డి టాటా జీవితంపై సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
జాన్ అబ్రహం తన సొంత బేనర్‌పై ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం....ఈ సినిమా కోసం జాన్ అబ్రహం మూడు టైటిల్స్ రిజిస్టర్ చేయించాడని తెలుస్తోంది. జేఆర్‌డి టాటా, టాటా సన్స్, జంమ్షద్ జీ అనే టైటిల్ రిజిస్టార్ చేయించారట. ఇదే నిజమైతే.....ఇది జాన్ అబ్రహం నటించబోయే తొలి బయెపిక్ సినిమా కానుంది.
జేఆర్‌డి టాటా తండ్రి పార్శీ జాతికి చెందిన వాడు కాగా, ఆయన తల్లి ఫ్రెంచి జాతీయురాలు. జాన్ అబ్రహం మదర్ కూడా పార్శీ కావడంతో.....ఈ పాత్ర చేయడానికి ఆయన పర్‌ఫెక్టుగా సూటవుతాడని, పార్శీల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో జాన్ అబ్రహంకు బాగా తెలుసని బాలీవుడ్ సర్కిల్‌లో చర్చించుకుంటున్నారు.
ఇప్పటి వరకు జాన్ అబ్రహం రెండు మంచి చిత్రాలు నిర్మించాడు. అందులో ఒకటి ఆయుష్మాన్ ఖురానా నటించిన 'వీకీ డోనర్' చిత్రం కాగా, మరొకటి జాన్ అబ్రహం నటించిన 'మద్రాస్ కేఫ్'. తాజాగా జాన్ అబ్రహం నిర్మించబోయే ఈ మూడో సినిమాకు సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై సూజిత్ సర్కార్ మాట్లాడుతూ....ఇంకా ఏ విషయం ఫైనలైజ్ కాలేదని, ఏది కన్ ఫర్మ్ కాలేదని తెలిపారు.
అభిషేక్ బచ్చన్ అప్పట్లో ధీరూభాయ్ అంబానీ జీవితంపై వచ్చిన 'గురు' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్టయింది. ఈ నేపథ్యంలో జేఆర్‌డి టాటా జీవితంపై వస్తున్న సినిమాకు కూడా మంచి స్పందన వస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











