SSMB28: మహేశ్ మూవీలో ఆ స్టార్ హీరో.. విలన్ కాని విలన్‌గా.. ఇద్దరి సీన్స్‌కు విజిల్స్ పక్కా!
ఈ మధ్య కాలంలో సత్పలితాలను రాబడుతూ తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఒకటి పట్టాలపై ఉండగానే మరొకటి అన్నట్లుగా వరుస ప్రాజెక్టులతో సందడి చేస్తోన్న అతడు.. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఇందులో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఎవరా హీరో? అతడు ఏ పాత్రను చేస్తున్నాడు? ఆ పూర్తి వివరాలపై మీరే లుక్కేయండి మరి!
గురూజీతో మహేశ్ సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా ఓ సినిమాను చేస్తోన్నాడు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది కీలక పాత్రలను పోషిస్తున్నారు.

అనుకోని ఘటనలతో లేట్: మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఆ తర్వాత మహేశ్ ఇంట్లో వరుస విషాదాలు, అతడు కరోనా బారిన పడడం సహా కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో షూట్ లేట్ అయింది.

చిత్ర యూనిట్ క్లారిటీతో: క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, షూటింగ్ సజావుగా సాగకపోవడంతో దీన్ని వాయిదా వేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే దీన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చే రూమర్లను ఇటీవలే నిర్మాత నాగ వంశీ ఖండించాడు.

ఎంతో మంది స్టార్ల రోల్స్: మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఎంతో మంది స్టార్లు భాగం అయినట్లు ఇప్పటికే లీక్ అయింది. ముఖ్యంగా ఇందులో విలన్‌గా జగపతి బాబు, మహేశ్ తాతగా ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. వీళ్లతో పాటు మరికొందరు పక్క ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మహేశ్ మూవీలో ఆ స్టార్: ఇద్దరు స్టార్ల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్లు భాగం కాబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహంను తీసుకున్నారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.

ఇద్దరి సీన్స్ హైలైట్‌గానే: విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో జాన్ అబ్రహం ఓ ఫేమస్ బిజినెస్‌మ్యాన్‌గా నటిస్తున్నాడట. అతడితో ఓ విషయంలో మహేశ్ బాబుకు విబేధాలు వస్తాయని తెలిసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు మొదలు అవుతాయని.. ఆ సమయంలో వచ్చే సన్నివేశాలు విజిల్స్ వేయించేలా ఉంటాయని తెలిసింది. దీంతో ఈ కాంబోపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











