రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో?
బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం-సెక్సీ హీరోయిన్ బిపాసా బసు మధ్య గత కొన్నేళ్లుగా సాగిన 'సం'బంధం గత కొన్ని నెలల క్రితం తెగదెంపులు అయిన సంగతి తెలసిందే. కారణాలు ఖశ్చితంగా తెలియదుకానీ...ఇద్దరి మధ్య గొడవలు రాబట్టే సహజీవనానికి స్వస్తి చెప్పారని బాలీవుడ్ జనాలు చర్చించుకున్నారు.
వాళ్ల సంబంధం విషయం పక్కన పెడితే...బిపాసాతో విడిపోయిన తర్వాత జాన్ అబ్రహం ప్రియా అనే అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెట్టాడు. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాకింగ్ రంగానికి చెందిన ధనవంతుల కుమార్తె. బిపాసా కుళ్లుకోవాలనే జాన్ ఆమెతో ఎఫైర్ మొదలు పెట్టారనే వాదన కూడా ఉంది.
తాజాగా బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం జాన్ అబ్రహం-ప్రియా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల క్రితం లాస్ ఏంజిల్స్ లో వీరి వివాహం జరిగిందని, ప్రస్తుతం జాన్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు. జాన్ తన బర్త్ డే పార్టీని కూడా ప్రియా, ఆమె కుటుంబ సభ్యులతోనే జరుపుకున్నాడట.
ఈ వార్తల సంగతి పక్కన పెడితే...గత కొన్ని రోజుల క్రితం ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. రాబోయే ఏప్రిల్‌లో జాన్-ప్రియా నిశ్చితార్థం ఉంటుందని ఆ వార్తల సారాంశం. ఈ లోపే పెళ్లి జరిగిందనే వదంతులు రావడంతో ఏది నమ్మాలో తెలియని పరిస్థితి నెలకొంది.


Click it and Unblock the Notifications











