మహేష్ 'దూకుడు'పై జోకులు
మహేష్, శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'దూకుడు' చిత్రంపై అంతటా ఇప్పుడు జోకులు వేసుకుంటున్నారు.దానికి కారణం మహేష్ ఎంతో ఆలస్యం చేస్తున్న ఈ చిత్రానికి 'దూకుడు' అనే టైటిల్ పెట్టడమేనంటున్నారు. దాదాపు ఏడాది క్రితమే అంటే 2010 జూన్‌లోనే 'దూకుడు' లాంఛనంగా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్‌ని 2010 సెప్టెంబర్ నుంచి జరుపుతున్నారు. అయితే ఇప్పటికి సినిమా 75 శాతమే అయ్యిందనీ, సినిమా పూర్తవడానికి కనీసం ఇంకో నెలన్నా పడుతుందనీ తెలుస్తోంది. అంటే నిర్మాతలు చెప్పినట్లుగా ఈ చిత్రం ఆగస్టులో విడుదలయ్యే అవకాశం లేదు.దాంతో ఈ సినిమాకి 'దూకుడు' అని కాకుండా 'నెమ్మది' అని పెడితే బాగుంటుందని పరిశ్రలో వాళ్ళే జోకులు వేస్తున్నారు. అందులోనూ స్పీడుగా తీస్తాడని పేరున్న శ్రీనువైట్ల కూడా ఈ సినిమాతో స్లో అవటం కూడా అందరినీ ఆశ్చర్యంలో పడేస్తోంది. అయితే దీనికి కారణం ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేస్తున్న మహేష్ అంటున్నారు. సినిమాని యాడ్ పిల్మ్ ల షూటింగులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడని ఇటీవలి కాలంలో విమర్శలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











