2019 నాటికి ఎన్టీఆర్ లక్ష్యం అదేనంటున్నాడు
జూ ఎన్టీఆర్ చాలా ప్రణాళికా బద్దంగా తన జీవితాన్ని ,కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారని ఆయన ఆలోచనలు,చేష్టలు చూసిన వారికి అర్దమవుతుంది. తాజాగా ఆయన తన మనస్సులో మాటని కొందరు మీడియా వ్యక్తులు దగ్గర చెప్పినట్లు తెలుస్తోంది. ఆయన మాటల్లో ఎన్టీఆర్... ప్రస్తుతం తాను సినీ రంగంలో బిజీగా ఉన్నందున ఇప్పటికిప్పుడు రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలని అనుకోవడం లేదన్నారు.
రెండువేల పందొమ్మిదినాటికి తెలుగుదేశం పార్టీని తన నియంత్రణలోకి తీసుకోవడం కాని, ఆ పార్టీలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించడం కాని చేయాలని జూనియర్ ఎన్టిఆర్ భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. అప్పటికి పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మారతాయని ఆయన భావిస్తున్నారు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ,సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో ఊసరవిల్లి చిత్రం రూపొందుతోంది. తమన్నా ఈ చిత్రంలో హీరయిన్ గా చేస్తోంది. అలాగే మరో ప్రక్క బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications