NTR30: కొనసాగుతున్న మరో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్.. ఇద్దరు తోపులే, ఎవరిని ఫిక్స్ చేయాలి?
జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా అనంతరం తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన టెక్నీషియన్ల విషయంలో ఇప్పటికే కొరటాల ఒక నిర్ణయానికి రాగా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో తారక్ నుంచి అభ్యంతరం వచ్చినట్లు టాక్ వస్తోంది.
హాట్ హాట్ ఫోజులతో మంట పెడుతోన్న సాహో బ్యూటీ శ్రద్దా కపూర్

వారి మధ్య ఏదో జరిగిందని..
గతంలో ఎప్పుడు లేని విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక అగ్ర దర్శకుడైన త్రివిక్రమ్ ను కాదని కొరటాల శివను లైన్ లోకి తేవడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇద్దరి మధ్య మంచి వాతావరణంతోనే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిక్ అయినట్లు కథనాలు వచ్చాయి గాని ఒక్కరు కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు.
దీంతో త్రివిక్రమ్ తారక్ మధ్య ఏదో జరిగిందని రూమర్స్ కూడా వచ్చాయి.

వచ్చే ఏడాదికి..
ఇక మొత్తానికి కొరటాల శివ ముందే సెట్ చేసుకున్న ఒక స్టోరీని జూనియర్ ఎన్టీఆర్ తో చేయడానికి ప్లాన్ సెట్ చేసుకుంటున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్టు గానే రూపొందనుంది. ఇక కొరటాల అల్లు అర్జున్ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

జనతా గ్యారేజ్ తరహాలోనే
ఇక సినిమాకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. ఎందుకంటే కొరటాల జనతా గ్యారేజ్ తరహాలోనే దేవిశ్రీప్రసాద్ ను ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటూ ఉండగా తారక్ మాత్రం అతను పాన్ ఇండియా ప్రాజెక్టుకు న్యాయం చేయకపోవచ్చని అందుకే అనిరుధ్ పేరును సజెస్ట్ చేసినట్లు టాక్.
Recommended Video

ఎవరి పంతం నెగ్గుతుందో..
అనిరుధ్ ఇటీవల మాస్టర్ సినిమా మ్యుజిక్ తో నేషనల్ లెవెల్లో హైప్ క్రియేట్ చేశాడు. అందుకే ఎన్టీఆర్ అతన్ని సజెస్ట్ చేస్తున్నట్లు టాక్. దేవిశ్రీప్రసాద్, అనిరుధ్ ఇద్దరు కూడా అద్భుతమైన సంగీత దర్శకులు కావడంతో ఎవరిని సెలెక్ట్ చేయలేనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది. మరి ఈ విషయంలో ఎవరి పంతం నెగ్గుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











