సాయి పల్లవి - ఎన్టీఆర్ కాంబినేషన్ అంటూ ప్రచారాలు.. ఆ రోజే అఫీషియల్ క్లారిటీ?
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు కూడా ఏ విధంగా తెరకెక్కుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల RRR సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా తో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలి అని ప్రణాళికలు రచిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న తన సినిమా కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం రెడీ అవుతున్నాడు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం లో మళ్ళీ కొన్ని రూమర్స్ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సాయి పల్లవి తో కూడా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ విషయంలో ఎప్పుడూ క్లారిటీ రానుంది అనే వివరాల్లోకి వెళితే..

పాన్ ఇండియక్ రేంజ్ కు తగ్గట్టుగా
జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమాలో నటించిన ఇద్దరు హీరోలు తదుపరి సినిమాలో ఎలాంటి విజయాలను అందుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్టీఆర్ తన 30వ సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో రెడీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

అలియా ఫిక్స్ అన్నారు!
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ప్రాజెక్టు విషయంలో గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఇదివరకే ఒక క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఆలియాభట్ దాదాపు ఫిక్సైనట్లు గా అనిపించింది ఎందుకంటే.. ఆలియా కూడా ఆ విషయంలో పాజిటివ్ గానే స్పందించింది.

ఆమె ఫిక్స్?
అలియా భట్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్లే అని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె మళ్ళీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా రష్మిక మందన్నను కూడా దర్శకుడు కొరటాల సంప్రదించినట్లు సమాచారం. ఇక ఆమె ఫిక్స్ అయ్యిందా లేదా అనే విషయంలో అయితే ఇంకా క్లారిటి రాలేదు. బహుశా ఈ ప్రాజెక్టులో ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఉండవచ్చు అని.. ఆలియా భట్ తర్వాత మరొక హీరోయిన్ కోసం కూడా సంప్రదించి ఉండవచ్చునని టాక్ వచ్చింది.

సాయి పల్లవి?
ఇక ఆలియాభట్ రష్మిక మందన్న పేర్ల అనంతరం టాలెంటెడ్ బ్యూటీ సాయిపల్లవి పేరు కూడా వినిపించడం చర్చనీయాంశంగా మారింది. డాన్స్ తో ఇరగదీసే సాయి పల్లవి జూనియర్ ఎన్టీఆర్ తో ఒక్క సాంగ్ లో కనిపించినా కూడా సినిమాకు హైప్ అయితే మామూలుగా రాదు అని చెప్పవచ్చు. ఇక దర్శకుడు కొరటాల శివ ఆమెను కూడా సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

క్లారిటీ వచ్చేది ఎప్పుడంటే?
ఇక హీరోయిన్ విషయంలో క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ చివరకు ఆగాల్సిందే. ఇక ఎన్టీఆర్ 30వ సినిమాపై మే 20వ తేదీన అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ రెడీ చేసినట్లు సమాచారం. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో.. చిత్ర యూనిట్ ఆ విషయంలో అలాగే షూటింగ్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











