NTR30: మరో ఆసక్తికరమైన అప్డేట్.. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ హిట్టే..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం బిగ్ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అంతే కాకుండా మరికొన్ని బిగ్ ప్రాజెక్టులు సెట్స్ పైకి రావడానికి కూడా రెడీ అవుతున్నాయి. అలాంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులలో ఎన్టీఆర్ 30వ సినిమా కూడా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30వ సినిమా కోసం అభిమానుల్లో అంచనాలు మామూలుగా లేవు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ లాంచ్ డేట్ తో పాటు హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

అదే ఫార్మాట్ లో ఎన్టీఆర్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర హీరోలు వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ఒక్కసారి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేస్తే మళ్ళీ అదే ఫార్మాట్ లో సినిమాలు ఉండాలి అనేలా మన అగ్ర హీరోలు భారీగానే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ఫార్మాట్ లో వెళుతున్నాడు.

RRR కారణంగా..
RRR సినిమా సంక్రాంతి విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా మరోసారి వాయిదా పడక తప్పలేదు. ఎన్టీఆర్ ఆ సినిమా కోసమే తన తదుపరి సినిమాల విషయంలో కాస్త ఆలస్యంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కొరటాల శివతో తన 30వ సినిమా లాంచ్ విషయంలో కూడా కాస్త లేటుగానే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

హీరోయిన్ ఫిక్స్?
అసలు మ్యాటర్ లోకి వెళితే.. ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ ను త్వరలోనే అధికారికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మేయిన్ హీరోయిన్ గా కీయరా అద్వానీ, అలియా భట్ అంటూ పేర్లు బాగానే వినిపించాయి. ఇక ఇప్పుడు అలియా భట్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తుండడం వలన నిర్మాత చర్చలు జరిపి కాస్త తగ్గించేలా చేయాలని అనుకుంటున్నారట.

మ్యూజిక్ డైరెక్టర్ అతనే..
ఇక సంగీత దర్శకుడిగా ఎవరు సెలెక్ట్ అవుతారనేది హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ నుంచి అయితే అనిరుధ్ ని సెలెక్ట్ చేసుకోవాలని డిమాండ్ గట్టిగానే వచ్చింది. కానీ కొరటాల శివ ఆచార్య ముందు వరకు కూడా దేవి శ్రీ ప్రసాద్ ను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. అయితే మెగాస్టార్ ఆలోచన కారణంగా ఆచార్య సినిమాకు మణిశర్మతో వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల ఎలా ఆలోచిస్తాడో చూడాలి.

లాంచ్ ఎప్పుడంటే?
ఇక ఫిబ్రవరి 18న సినిమాను అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. RRR సినిమా వాయిదా పడడంతో ఎన్టీఆర్ మళ్లీ వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక కొరటాల కూడా ఆచార్య పనులను ముగించి ఏప్రిల్ 1కి సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. కాబట్టి ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాను లాంచ్ చేసి కొంత గ్యాప్ లో రెగ్యులర్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట.


Click it and Unblock the Notifications











