జూ.ఎన్టీఆర్ 3D సినిమా... కీ రోల్ లో కార్తిక్
జూ.ఎన్టీఆర్ త్వరలో ఓ త్రిడి చిత్రం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో తమిళ హీరో కార్తిక్ కి ఓ కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.తాజాగా పి వాసు దర్శకత్వంలో వచ్చిన పులి వేషం చిత్రం కార్తిక్ నటన చూసిన ఎన్టీఆర్ ఇంప్రెస్ అయి ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ త్రిడి చిత్రం కోసం ఇప్పటికే గత మూడు నెలలుగా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అయితే దర్శకుడు ఎవరు,కథ ఏమిటన్నది తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ స్క్రిప్టు డవలప్ చేస్తున్నారు. ఈ న్యూస్ కూడా కార్తిక్ ద్వారా తమిళ పరిశ్రమలో తెలిసి బయిటకు రావటం జరిగింది. ఇక ఎన్టీఆర్ నటించిన ఊసరవిల్లి చిత్రం దసరాకు రెడీ అవుతోంది. అలాగే బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందుతున్న దమ్ము చిత్రం కూడా ఈ సినిమా తర్వాత షూటింగ్ కు వెళ్లనుంది. త్రిడి చిత్రం అంటే జానపద చిత్రం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వివరాలు తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











