twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ అదుర్స్ లీక్

    By Staff
    |

    ఎన్టీఆర్, వి.వి వినాయిక్ కాంబినేషన్లో రెడీ అవుతున్న అదుర్స్ సినిమా స్టిల్స్ లీకయ్యాయి. అయితే అవి అబిమానులుకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. ఈ స్టిల్స్ లో ఎన్టీఆర్ బ్రాహ్మణుడు గెటప్ లో బ్రహ్మానందం ప్రక్కన ఉన్నారు. కథ ప్రకారం ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్వి పాత్రలను పోషిస్తున్నాడు. అందులో ఒక పాత్ర నరసింహాచారి కాగా మరో పాత్ర నరసింహ అని వినికిడి. సెకెండాఫ్ లో అన్ని డ్యూయల్ రోల్ చిత్రాలు లాగానే పాత్రలు తారుమారవటం..అందు నుంచి వచ్చే కామిడీ అని నవ్విస్తుందంటున్నారు.

    సీమశాస్త్రి తరహాలో ఎన్టీఆర్..డాన్ ప్లేస్ లోకి వెళ్లి అక్కడ చేసే పోరాటాలు పూర్తి వినోదాన్ని పంచుతాయంటున్నారు. ఇక ఈ సినిమా పూర్తి స్ధాయి ఎంటర్టైన్ మెంట్ తో రూపొందుతోందని చెప్తున్నారు. నా అల్లుడు సినిమా తర్వాత డ్యూయల్ కాన్సెప్ట్ (ఆ సినిమాలో ఒక్కడే కనపడతాడు అయినా సినిమా అంతా ఇద్దరు ఉన్నారన్న భ్రమ కలిగిస్తారు)తో రెడి అవుతున్న చిత్రం ఇదే.దాంతో ఎన్టీఆర్ అభిమానులే కాక మిగతా వారు కూడా ఈ సినిమాను ఆసక్తితో చర్చించుకుంటున్నారు. వారి అంచనాలుకు తగ్గకుండా సినిమా తయారుఅవుతుందని ఆశిద్దాం.

    ఇక ఆమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన యంగ్ హీరో ఎన్టీఆర్‌ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగులో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సంగతిని ఎన్టీఆర్‌ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఈ నెల 20 నుంచి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగులో పాల్గొనబోతున్నా. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై కొడాలి నాని, వల్లభనేని వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకధాటిగా మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ప్రస్తుతం నా ధ్యాసంతా ఈ చిత్రం మీదే అని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X