ఒకే వేదికపై అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఎవరి కోసం వస్తున్నారు? ఎందుకు కలుస్తున్నారంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది స్టార్ హీరోలు తమ బంధువులను సైతం సినీ రంగంలోకి పరిచయం చేశారు. అలా ఇప్పటికే ఎంతో మంది కుర్రాళ్లు మూవీ జర్నీని మొదలు పెట్టేశారు. అలా పరిచయం అయిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఒకడు. ఇప్పటికే సినిమాల్లోకి వచ్చిన అతడు.. ఇప్పుడు 'ఆయ్' (AAY) అనే సినిమాలో నటిస్తున్నాడు.

నార్నే నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీనే 'ఆయ్'. కంచిపల్లి అంజిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంతో సాగే కామెడీ స్టోరీతో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై అందరి దృష్టి పడింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇలా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా ఇప్పటికే పూర్తి చేసుకున్నారు.

Jr NTR and Allu Arjun Chief Guests For AAY Movie Pre Release Event

క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఆయ్' మూవీని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఆయ్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని మరో రెండు మూడు రోజుల్లో జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది.

Jr NTR and Allu Arjun Chief Guests For AAY Movie Pre Release Event

నార్నే నితిన్ హీరోగా నటించిన 'ఆయ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారన్న దానిపైనా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీనికి టాలీవుడ్ టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరవుతారని తెలిసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. పూర్తి స్థాయి ఫన్ స్టోరీతో రూపొందుతోన్న 'ఆయ్' సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీది నిర్మిస్తున్నారు. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంకిత్ కొయ్య, కృష్ణ చైతన్య, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీకి రామ్ మిరియాల సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Read more about: aay allu arjun jr ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X