దేవర కోసం చేతులు కలుపుతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ హల్బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఆవ్వబోతుందా?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ కుటుంబాల నుంచే అనేకమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. మేజర్ గా టాలీవుడ్ లో వీరి కుటుంబాల హీరోల సినిమాలే ఎక్కువ శాతం విడుదలకి వస్తుంటాయి. మరి ఈ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు మేజర్ గా వినిపిస్తాయి. వీరితో పాటుగా ఘట్టమనేని కుటుంబం కూడా ఉంది కానీ ఎక్కువ మంది వారసులు మాత్రం ఆ నాలుగు కుటుంబాల నుంచి నోటెడ్ గా ఉండడంతో వారిపై ఎక్కువ ఫోకస్ వెళుతుంది.

అయితే ఆ కుటుంబాల్లో మెగా అండ్ నందమూరి కుటుంబాల హీరోల అభిమానులకి గట్టి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. బాక్సాఫీస్ పరంగా ఇరు కుటుంబాల నుంచి సమ ఉజ్జిలు ఉంటారు కాబట్టి వారి నడుమ పోటీ మంచి రసవత్తరంగా ఉంటుంది. అయితే వీరి కుటుంబాల హీరోలలో ఇంకో కామన్ పాయింట్ కూడా కనిపిస్తుంది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల విషయంలో అని చెప్పాలి.

jr ntr and allu arjun wanted planning for a controversial interview

ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఇంకా సోషల్ మీడియాలో బావ బావ అంటూ కూడా పిలుచుకుంటారు. అయితే వీరి విషయంలో కొన్ని కామెంట్స్ ఎప్పుడూ కొన్ని వినిపిస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ ని ఏమో నందమూరి కుటుంబం దూరం పెడుతుంది అని అలాగే అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి దూరం వెళ్ళాలి అని అనుకుంటున్నాడు అందుకే కొన్ని కాంట్రవర్సీలు రేపుతున్నాడు అంటూ వినిపిస్తున్నాయి.

దీనితో ఈ ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. దీనితో ప్రస్తుతం నడుస్తున్న కాంట్రవర్సీ ట్రెండ్ లో వాంటెడ్ గా చేస్తున్నట్టుగా పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనితో అందరి అటెన్షన్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ విషయంలో వినిపిస్తుంది.

jr ntr and allu arjun wanted planning for a controversial interview

కాగా ఇందులో అల్లు అర్జున్ పై తన ఫ్రెండ్ కోసం చేసిన కాంట్రవర్సీ రిలేటెడ్ ప్రస్తావన మళ్ళీ చేయొచ్చు అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓ పక్క ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ చిరంజీవి అండ్ బాలయ్య అభిమానులతో గట్టిగానే ట్రిగ్గర్ చేసే విధంగా పోస్టింగులు చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వీరి నడుమ ఇంటర్వ్యూ ఉండేదుకు ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయని వినిపిస్తుంది.

మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ లో కాంట్రవర్సియల్ ఇంటర్వ్యూ ఉంటుందో లేదో అనేది. కాగా ఈ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ "దేవర" ప్రమోషన్స్ లో భాగంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27న ఘనంగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక బన్నీ తన అవైటెడ్ సీక్వెల్ చిత్రం "పుష్ప 2" లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

More from Filmibeat

Read more about: jr ntr pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X