For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Amit Shah With NTR: ఎన్టీఆర్, అమిత్ షా భేటీ సీక్రెట్ ఇదే.. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే!

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఆస్కార్ అంచనా జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయ్యాడు. అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

  నేషనల్ స్టార్‌గా.. ఆస్కర్ రేసు

  నేషనల్ స్టార్‌గా.. ఆస్కర్ రేసు

  వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ చిత్రం అతడికి దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగేలా చేసింది. ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అయిన వెరైటీ మ్యాగజైన్ 2023 సంవత్సరానికి గానూ ఆస్కార్ అవార్డుకు అర్హులైన నటుల్లో ఎన్టీఆర్‌కు చోటిచ్చింది.

  ఊహించని విధంగా అనన్య నాగళ్ల హాట్ షో: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  అమిత్ షాతో ఎన్టీఆర్ మీటింగ్

  అమిత్ షాతో ఎన్టీఆర్ మీటింగ్


  ఆదివారం తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మునుగోడులో బహిరంగ సభ పూర్తయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావుతో భేటీ అయ్యారు. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌‌కు చేరుకున్నారు. అక్కడ టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారు. ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.

  అమిత్ షా బొకే.. తారక్ కూడా

  అమిత్ షా బొకే.. తారక్ కూడా


  జూనియర్ ఎన్టీఆర్‌ను కలవాలని అమిత్ షా కోరుకోగానే ఇక్కడి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. దీంతో ఆదివారం రాత్రి శంషాబాద్‌లోని నోవాటెల్‌లో వీళ్లిద్దరూ కలిశారు. హోటల్‌లో ఎన్టీఆర్‌కు అమిత్ షా ఫ్లవర్ బొకే ఇచ్చి స్వాగతం పలికారు. ఆ వెంటనే తారక్ ఆయనకు శాలువా కప్పి సన్మానించాడు. వీళ్లిద్దరూ దాదాపు 30 నిమిషాల పాటు భేటీ అయి పలు విషయాలు మాట్లాడారు.

  బికినీ సైజ్ తగ్గించిన పూనమ్ బజ్వా: వామ్మో ఇదేం దారుణం సామీ!

  అభినందన.. ఆ విషయాలు

  అభినందన.. ఆ విషయాలు


  రాజకీయ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం.. RRR మూవీలో నటనకు గానూ జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్ షా అభినందించారని తెలుస్తోంది. అంతేకాదు, సీనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన నటించిన విశ్వామిత్ర, దానవీర శూరకర్ణ వంటి సినిమాలు చూశానని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.

  రాజకీయాలపైనా చర్చలు

  రాజకీయాలపైనా చర్చలు

  ఎన్టీఆర్‌తో భేటీ అయిన సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పనులు, అభివృద్ధి, సంస్కరణల గురించి అమిత్ షా ప్రస్తావించారట. అంతేకాదు, ప్రస్తుత రాజకీయాలపైనా వీళ్లిద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్.. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించినట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

  తల్లైన వెంటనే సోనమ్ కపూర్ షాకింగ్ పోస్ట్: అసలు ఇష్టం లేకుండానే అంటూ!

  ఫ్యూచర్ కోసమే ఇలా అంటూ

  ఫ్యూచర్ కోసమే ఇలా అంటూ

  ఇక, ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయిన విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. కొందరు ఈ సమావేశం రాజకీయాలతో సంబంధం లేని విధంగా సాగిందని అంటుంటే.. మరికొందరు మాత్రం బీజేపీ భవిష్యత్ ప్రణాళికలో భాగంగానే తారక్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ భేటీతో ఎన్టీఆర్ రేంజ్ మరింతగా పెరిగిందని చెప్పొచ్చు.

  షా అలా.. ఎన్టీఆర్ ఇలా ట్వీట్

  షా అలా.. ఎన్టీఆర్ ఇలా ట్వీట్

  ఎన్టీఆర్‌తో భేటీ తర్వాత అమిత్ షా 'అత్యంత ప్రతిభావంతుడైన నటుడు.. తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది' అని ట్వీట్ చేశారు. అలాగే, ఎన్టీఆర్ 'మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. మీ విలువైన మాటలకు ధన్యవాదాలు' అని ట్వీట్‌ చేశాడు.

  English summary
  Tollywood Star Hero Jr NTR Met Central Minister Amit Shah Last Night in Hyderabad. Now Their Meeting Gone Hot Topic in National Wide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X