For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR32: ఆస్కార్ రేంజ్ పాత్రలో ఎన్టీఆర్.. ఇండియాలోనే ఎవరూ చేయని విధంగా!

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనలోని అన్ని రకాల టాలెంట్లను బయట పెట్టుకుని తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మధ్యలో చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం తారక్ మునుపెన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు టాలీవుడ్‌లోని యంగ్ డైరెక్టర్‌కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడని తెలిసింది. అంతేకాదు, అతడితో చేయబోయే సినిమాలో తారక్ రోల్ కూడా లీకైంది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  వరుస హిట్లతో ఎన్టీఆర్ బీభత్సం

  వరుస హిట్లతో ఎన్టీఆర్ బీభత్సం

  చాలా కాలం పాటు హిట్లు లేక ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్.. 'టెంపర్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతడి మార్కెట్ కూడా భారీ స్థాయిలో పెరిగింది. అప్పటి నుంచి తారక్ యమ జోష్‌తో కనిపిస్తున్నాడు.

  ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

  నేషనల్ రేంజ్‌లో ఎన్టీఆర్ హవా

  నేషనల్ రేంజ్‌లో ఎన్టీఆర్ హవా


  వరుస హిట్లతో ఉత్సాహంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అయింది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. అలాగే, తారక్‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తీసుకొచ్చి అతడని పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది.

  కొరటాలతో సినిమా.. అక్టోబర్‌లో

  కొరటాలతో సినిమా.. అక్టోబర్‌లో

  RRR పట్టాలపై ఉన్నప్పుడే తారక్ తన 30వ సినిమాను కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనిని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. దీనికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంది.

  అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

  ప్రశాంత్ నీల్‌తో సినిమా కూడా

  ప్రశాంత్ నీల్‌తో సినిమా కూడా

  జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. ఇక, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కానీ, మేలో కానీ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

  బుచ్చిబాబు సనతో క్రేజీ మూవీ

  బుచ్చిబాబు సనతో క్రేజీ మూవీ

  ఇప్పటికే పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్.. ఈ క్రమంలోనే 'ఉప్పెన' ద్వారా భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సనతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందుకోసం సదరు డైరెక్టర్ స్పోర్ట్స్ బేస్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట. దీన్ని కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని ప్రచారం జరుగుతోంది.

  శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

  ఫుల్ స్క్రిప్టు.. ఒప్పుకున్న తారక్

  ఫుల్ స్క్రిప్టు.. ఒప్పుకున్న తారక్

  వాస్తవానికి 'ఉప్పెన' విడుదలైన వెంటనే బుచ్చి బాబు.. ఎన్టీఆర్ కోసం ఓ కథను రెడీ చేశాడు. అది విన్న ఈ స్టార్ హీరో.. కొన్ని మార్పులను సూచించాడు. దీంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే, తాజాగా బుచ్చి బాబు తన కొత్త స్క్రిప్టును ఎన్టీఆర్‌కు వినిపించాడట. ఇది విన్న వెంటనే అతడు బాగా ఎగ్జైట్ అయ్యాడని తెలిసింది. అంటే త్వరలోనే ఇది మొదలు కానుంది.

  ఆస్కార్ రేంజ్.. రెండు పాత్రలు

  ఆస్కార్ రేంజ్.. రెండు పాత్రలు


  తాజా సమాచారం ప్రకారం.. బుచ్చి బాబు మూవీ స్ప్రోర్ట్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందట. ఇందులో ఎన్టీఆర్ మారథాన్ రన్నర్‌గా నటిస్తున్నాడని తెలిసింది. అయితే, అతడు ఓ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోతాడట. అతడి ఆశయాన్ని కొడుకైన మరో ఎన్టీఆర్ నెరవేర్చుతాడట. అతడి పాత్ర ఎమోషన్స్‌తో కూడి ఆస్కార్ రేంజ్‌లో ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా ఇండియాలో ఎప్పుడూ రాని సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం.

  English summary
  Jr NTR has given a green signal to a film in the direction of Buchi Babu Sana. This Star Hero Plays Marathon Runner Role in This Film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X