Koratala Siva : దేవర 2లో బాలీవుడ్ సూపర్‌స్టార్ .. లీక్ చేసిన కొరటాల, గెస్ట్ రోల్ కాదంటూ

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ తన భుజాలపై సినిమాను మోశాడు. కేవలం విడుదలైన వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకుని డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టాడు దేవర. ఈ సినిమాలో పార్ట్ 2 కోసం కొన్ని ట్విస్ట్‌లు దాచి ఉంచారు కొరటాల .. అవేంటి అన్న దానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే పార్ట్1లో ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు ఉండగా.. పార్ట్2లో వాటికి ఆన్సర్స్ ఇస్తామని శివ చెప్పారు. ఈ వివరాలు మీ కోసం.

ఆచార్య డిజాస్టర్ నేపథ్యంలో దేవర విషయంలో ఏ చిన్న తప్పుకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కొరటాల. తను అనుకున్న కథను రెండు భాగాలుగా చూపించాలని ముందే నిర్ణయించాడు. దేవర మొదలైనప్పటి నుంచి కొరటాల ముఖంలో నవ్వు లేదని, టెన్షన్ పడుతూనే షూటింగ్ చేశాడని గుర్తుచేశారు హీరో ఎన్టీఆర్ తెలిపారు. రీ రికార్డింగ్, డబ్బింగ్ సమయంలో భయపడుతున్న కొరటాలకు అనిరుధ్ ధైర్యం చెప్పి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నాడని తారక్ గుర్తుచేశారు.

jr ntr and koratala siva leaked devara 2 cast and crew here s the details

సెకండ్ పార్ట్‌పై ఉత్కంఠ కలిగించడానికి, హైప్ తీసుకురావడానికి కొరటాల కొన్ని ట్విస్ట్‌లు పెట్టారు. ముఖ్యంగా సముద్రం అడుగున ఉన్న అస్థిపంజరాలు ఎవరివి అన్న దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సుమ ఈ విషయాలను రాబట్టే ప్రయత్నం చేసింది. సముద్రం అడుగున చాలా అస్థిపంజరాలు ఉన్నాయని, ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ వ్యక్తిదని కొరటాల ట్విస్ట్ ఇచ్చారు. ఆ వ్యక్తిని సినిమాలో ఆల్రెడీలో చూశామా, లేక చూడబోతున్నామా అని సుమ ప్రశ్నించగా.. అన్ని చెబితే కుదరదని కొరటాల అంటాడు.

తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ మరిన్ని ఎక్స్‌క్లూజివ్ విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా పార్ట్ 2లో క్యాస్టింగ్ గురించి లైట్‌గా హింట్ ఇచ్చారు. తనకు చాలా మందిని సినిమాలో భాగం చేయాలని ఉందని.. రణబీర్, రణవీర్ సింగ్‌లను ఇందులో చూడాలని అనుకుంటున్నట్లు బయటపెట్టారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందినవారు కూడా ఉంటారని.. కానీ వాళ్ల పేర్లు చెప్పనని కొరటాల ట్విస్ట్ ఇచ్చారు. దీని వల్ల సినిమాపై భారీ అంచనాలతో పాటు రూమర్స్ వస్తాయని ఆయన తెలిపారు.

jr ntr and koratala siva leaked devara 2 cast and crew here s the details

దేవర 2లో కొత్త క్యారెక్టర్లు యాడ్ అవుతాయని.. వారి పాత్రల గురించి త్వరలోనే అనౌన్స్ చేస్తానని కొరటా శివ చెప్పారు. తన సినిమాల్లో వేరే ఇండస్ట్రీల నటులు గెస్ట్ రోల్స్ చేయరని.. వారు ఫుల్ లెంగ్త్‌లోనే కనిపిస్తారని చెప్పారు. వర, దేవర మధ్య ఆ రాత్రి ఏం జరిగింది... సినిమాలోని అస్థిపంజరాలు ఎవరివి అనే దాని గురించి పార్ట్ 2లో సమాధానం దొరుకుతుందన్నారు. కానీ ఖచ్చితంగా దేవర 2 గూస్ బంప్స్ తెచ్చే విధంగానే ఉంటుందని శివ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Read more about: jr ntr koratala siva devara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X