పిచ్చేక్కిస్తున్న మాస్ కాంబో.. బాలయ్య కోసం కదలిరానున్న ఎన్టీఅర్, మహేష్!
బాలకృష్ణ బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. విడుదలైన మొదటి ఆట నుంచి మంచి స్పందన తెచ్చుకున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

అబ్బురపోయేలా
బాలయ్యకు సింహా, లెజెండ్ లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి, ఈ సారి కూడా బాలయ్య కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం అఖండ రూపంలో ఫుల్ మాస్ మసాలా అందించారు. కథను, లాజిక్స్ ను పూర్తిగా గాలికొదిలేశారని నెగిటివ్స్ వినిపిస్తున్నా థియేటర్స్ దగ్గర మాత్రం ఒకరికరంగా మాస్ జాతర జరుగుతోంది. ఈ స్థాయి రెస్పాన్స్ కేవలం అభిమానులనే కాదు సినీ జనాలు కూడా అబ్బురపోయేలా చేస్తోంది.

ఎన్టీఆర్, మహేష్ బాబు ప్రసంసలు
అందుకే బాలయ్యకి, సినిమా యూనిట్ కి అభినందనలు తెలుపుతూ ట్వీట్స్ పెడుతున్నారు. జూ.ఎన్టీఆర్ ఈ సినిమా చూసి ఆనందాన్ని ట్వీట్ రూపంలో తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఇప్పుడే అఖండ సినిమా చూడటం పూర్తయిందని, మరో అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు బాలా బాబాయికి మరియు మొత్తం చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. ఇలాంటి సక్సెస్ అభిమానులకు అనందించే క్షణాలని అన్నారు.

వరుస అభినందనలు
అలాగే మరోపక్క 'అఖండ భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయ్యిందని వినడానికి చాలా సంతోషంగా ఉంది. నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుతో పాటు అఖండ టీంకు అభినందనలు' అంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. అంతేకాక ప్రేక్షకుల్లో 'అఖండ' ఫీవర్ చూస్తుంటే ఆనందంగా ఉందని.. బాలకృష్ణ - బోయపాటి శ్రీనులకు హీరో రామ్ పొతినేని అభినందనలు తెలిపారు.

భారీ ఈవెంట్
ఇలా ఒక్కరని కాదు దాదాపు అందరూ సినిమా గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే తాజాగా అఖండ సక్సెస్ మీట్ ఒకదానిని మేకర్స్ భారీ ఎత్తున క్రేజీగా ప్లాన్ చెయ్యడంతో సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా మరింత ఇంట్రెస్ట్ కలిగేలా కనబడుతుంది. అఖండ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ తో ఓ భారీ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.

అఖండ పై అంచనాలు
ఇక తాజా సమాచారం మేరకు ఆ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ లు చీఫ్ గెస్ట్ లుగా రాబోతున్నారు అని అంటున్నారు. ఒక రకంగా ఈ న్యూస్ కి నందమూరి ఫ్యాన్స్ కి అయితే పూనకాలు తెప్పించే న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ హాజరు అవుతారు అనుకుంటే అల్లు అర్జున్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై ఈ అఖండ పై అంచనాలు అలా పెంచేశారు.

ఎన్టీఆర్ - మహేష్ బాబు కలిసి
దీంతో ఈసారి బాలకృష్ణ తో ఎన్టీఆర్ - మహేష్ బాబు ఒకే స్టేజి పై అంటే అది నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇక ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి గెస్ట్ గా రావడమే కాదు.. బాలయ్య బాబు అన్ స్టాపబుల్ టాక్ షో కి గెస్ట్ గా వచ్చి ఫాన్స్ కి సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు.. ఇప్పుడు అఖండ ఈవెంట్ కి రావడంతో అటు మహేష్, ఇటు నందమూరి ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











