Kalki 2898 AD: మెంటల్ ఎక్కిస్తున్న ప్రభాస్ కల్కి క్యాస్టింగ్.. ఇప్పుడు తారక్, నాని కూడా ఎంటర్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898' ఏడి. పాన్ వరల్డ్ స్థాయిలో మే 9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే స్పెషల్ క్యామియో రోల్స్‌లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు ఉంటారని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగితి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తెలిసిన ట్విస్టు ఏంటంటే అతిథి పాత్రల లిస్ట్ మరింత పెద్దగా ఉందట. క్లైమాక్స్‌కు ముందు వచ్చే కీలక ఘట్టంలో హీరోలు నాని, ఎన్టీఆర్ కనిపిస్తారని అంటున్నారు. వివరాల్లోకి వెళితే...
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల పోస్ట్ పోన్ రూమర్స్ బాగా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రభాస్ కల్కి కూడా ఇదే దారి పడుతుందేమో అన్న అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే వైజయంతి మూవీస్ టీమ్ మాత్రం అలాంటిదేమి లేదని చెప్పుకుంటూ వస్తోంది. కచ్చితంగా చెప్పిన తేదీకే వస్తామని హామీ ఇస్తోంది. కాబట్టి మరో మూడున్నార నెలల్లో సిల్వర్ స్క్రీన్‌పై అతి పెద్ద విజువల్ ట్రీట్ రానుంది.

భూత భవిష్యత్ కాలాల నేపథ్యంతో ఈ సినిమా సాగనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ కూడా బాగానే ఆకట్టుకుంది. త్వరలోనే ఈ చిత్రం నుంచి టీజర్‌ను కూడా విడుదల చేసేలా మూవీటీమ్ ప్లానింగ్ చేస్తోంది. అయితే ఈ చిత్రంలో ఇప్పటికే ప్రభాస్‌తో పాటు భారీ తారగాణం నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ దీపిక పదుకొనె, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశాపటానీ నటిస్తున్నారు. ఇక యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.
అయితే ఈ బిగ్ స్టార్స్‌తో పాటే ప్రత్యేక క్యామియోల్లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండలు కూడా ఉంటారని ఈ మధ్యలో టాక్ గట్టిగా వినిపించింది. దాదాపుగా ఈ ఇద్దరు కనిపించడం నిజమని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా తెలిసిన మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఈ అతిథి పాత్రల లిస్ట్ మరింత పెరగనుందట.
క్లైమాక్స్‌కు ముందు వచ్చే కీలక సీన్స్‌లో నేచురల్ స్టార్ నానితో పాటు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పెషల్ రోల్స్‌లో కనిపించబోతున్నారు అని తెలిసింది. కృపాచార్యగా నాని, పరశురాముడిగా కొన్ని నిముషాల పాటు సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసే క్యారెక్టర్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారట. అయితే ఇందులో నిజమెంతో తెలీదు కానీ ప్రస్తుతం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. చూస్తుంటే నాగ అశ్విన్ అంచనాలకు మించి ఏదో పెద్ద ప్లానే చేయబోతున్నారని అర్థమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది. వైజయంతి నిర్మాణ సంస్థకు కలిసి వచ్చి మే9న ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు.. పలు విదేశీ భాషల్లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











