పాన్ ఇండియా దర్శకుడితో Jr ఎన్టీఆర్.. ప్రభాస్ వల్లే క్యాన్సిల్ అయ్యిందా?

టాలీవుడ్ హీరోలు రానున్న రోజుల్లో మరిన్ని పాన్ ఇండియా సినిమాల్లో నటించనున్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ప్రభాస్ బాహుబలితో మొదలు పెట్టి మిగతా వారికి ఒక నమ్మకాన్ని కల్పించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ ఏ ప్రాజెక్టు పట్టుకున్నా కూడా అది పాన్ ఇండియాగా రూపొందుతోంది. ఇక RRR తరువాత దాదాపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అదే తరహాలో అడుగులు వేయనున్నారు. అయితే చర్చలో దశలో ఉండగా ఇటీవల ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్న పాన్ ఇండియా దర్శకుడు సడన్ గా యూ టర్న్ తీసుకున్నాడు. అందుకు కారణం ప్రభాస్ అని ఒక టాక్ వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్

ఎన్టీఆర్.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో RRR సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత త్రివిక్రమ్ తో మరొక సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాతో పాటు మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టాలని అనుకున్నాడు తారక్. కానీ ఆ దర్శకుడు సడన్ గా యూ టర్న్ తీసుకోవడం అందరిని ఆశ్చర్య పరిచింది.

ప్రభాస్ తో సలార్..

ప్రభాస్ తో సలార్..

ఆ దర్శకుడు మరెవరో కాదు. KGF సినిమాతో అన్ని ఇండస్ట్రీలను ఆకర్షించిన ప్రశాంత్ నీల్. ప్రస్తుతం KGF సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ మరికొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేయనున్నాడు. ఇక వెంటనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్న ప్రశాంత్ ఇటీవల ప్రభాస్ తో సలార్ అనే ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏమైనట్లు?

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏమైనట్లు?

అసలైతే ప్రశాంత్ నీల్ KGF 2 అనంతరం జూనియర్ ఎన్టీఆర్ వర్క్ చేయాలని అనుకున్నాడు. హై వోల్టేజ్ లాంటి కథను కూడా లాక్ డౌన్ లోనే ఆల్ మోస్ట్ రెడీ చేశాడు. కానీ ఎందుకో ఆ కాంబో చర్చల వరకే నడిచింది. మైత్రి మూవీ మేకర్స్ అప్పుడప్పుడు ఆ కాంబోపై క్లారిటీ ఇచ్చే ప్రయత్న చేసినప్పటికీ అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ చర్చలు జరుగుతున్నట్లే ప్రవర్తించింది. అయితే సడన్ గా ప్రశాంత్ సలార్ ను ఎనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఏమైందనే ప్రశ్నలు తలెత్తాయి.

ప్రభాస్ వల్లే దర్శకుడు యూ టర్న్ తీసుకున్నాడా?

ప్రభాస్ వల్లే దర్శకుడు యూ టర్న్ తీసుకున్నాడా?

ఇక మరొక టాక్ కూడా వైరల్ అవుతోంది. ప్రశాంత్ నీల్ దాదాపు ఫుల్ స్క్రిప్ట్ వినిపించినప్పటికి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సారి ఎదో ఒకటి మిస్ అవుతోందని చెప్పాడంతో మళ్ళీ కథపై సిట్టింగ్స్ వేసిన ప్రశాంత్ కు సడన్ గా ప్రభాస్ నుంచి కాల్ అందుకున్నట్లు టాక్ వచ్చింది. మంచి కమర్షియల్ కథ ఉటే చూడమని చెప్పడం వల్ల ప్రశాంత్ యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టు.. ఉన్నట్లా లేనట్లా

ప్రాజెక్టు.. ఉన్నట్లా లేనట్లా

అయితే ప్రశాంత్, ఎన్టీఆర్ ప్రాజెక్టు ఇంతకు ఉన్నట్లా లేనట్లా అనే టాక్ వస్తోంది. అసలు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా లేక బిజీగా ఉండడం వల్ల ఎన్టీఆర్ పక్కన పెట్టమన్నాడా అనే సంగతి తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన రూమర్స్ ఇప్పుడు కన్నడలో కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తరువాత ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X