NTR31: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై బిగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్‌కు ఇది బిగ్ షాకే!

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' నుంచి మొదలుకొని వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో వెళ్తున్నాడు.

కెరీర్‌లోనే బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఈ ఏడాది అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత తారక్ నేరుగా బాలీవుడ్‌లోకి వెళ్లి హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తాడు.

Jr NTR and Prashanth Neel Movie Start Delay

వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఇది ఆలస్యం అవుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమాను మరింత లేట్ అవబోతుందని అంటున్నారు.

పవర్‌ఫుల్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ గతంలోనే వెల్లడించాడు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యే అవకాశం లేనట్లే చెప్పుకోవాలి. ఎందుకంటే తారక్ 'దేవర' షూట్ లేట్ అవడంతో పాటు 'వార్ 2'కు డేట్లు కేటాయించాడు. దీంతో ప్లాన్ మొత్తం మారింది.

Jr NTR and Prashanth Neel Movie Start Delay

నిజానికి ప్రశాంత్ నీల్ 'సలార్ 2' కంటే ముందే ఎన్టీఆర్ మూవీ చేయాలని భావించాడట. కానీ, అతడి డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఇప్పుడు ప్రభాస్ మూవీపైనే ఫోకస్ చేసినట్లు తెలిసింది. అంతేకాదు, ఎన్టీఆర్‌తో చేసే సినిమాను వచ్చే ఏడాది నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు తాజాగా తెలిసింది. దీంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

ఇదిలా ఉండగా.. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X