NTR31: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్.. సలార్ 2 కంటే ముందుగానే!
చాలా కాలం పాటు విజయమే లేక ఇబ్బంది పడినా.. 'టెంపర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి.. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' విజయాలను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. దీని తర్వాత తారక్ నేరుగా బాలీవుడ్‌లోకి వెళ్లి హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీలో నటించబోతున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను 'సలార్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఇది ఆలస్యం అవుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా బిజీగా ఉండడంతో ఈ సినిమాను మరింత లేటుగా మొదలు పెట్టబోతున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి మొదలు పెడతామని ప్రశాంత్ నీల్ గతంలోనే వెల్లడించాడు. అయితే, అలా జరగలేదు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది మే నుంచి ప్రారంభించబోతున్నారట. తాజాగా ఈ విషయాన్ని ప్రశాంత్ నీల్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ అభిమానులకు మరిన్ని సర్‌ప్రైజింగ్ విషయాలు కూడా తెలిశాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది మే లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించి.. ఆగస్టు చివరి వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుతారట. అలాగే, 2025 సమ్మర్‌లో దీన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు కూడా తాజాగా తెలిసింది.

ఇదిలా ఉండగా.. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











