నల్ల సముద్రంలో దిగుతున్న ఎన్టీఆర్.. ఫ్రెండ్ కోసం యంగ్ టైగర్ రిస్క్
స్టార్లుగా హవాను చూపించే హీరోలు టాలీవుడ్‌లో ఎంతో మంది ఉన్నారు. కానీ, సినిమా సినిమాకూ మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకునే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్న అతడు.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 27 విడుదల చేస్తున్నారు. దీని తర్వాత తారక్ నేరుగా బాలీవుడ్‌లోకి వెళ్లి హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తాడు. ఇప్పటికే ఈ షూట్‌లో కూడా పాల్గొన్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ప్రభాస్‌తో 'సలార్' సినిమాను చేయడంతో ఇది ఆలస్యం అయిపోయింది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా తన చిత్రాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను మరింత లేట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రతిష్టాత్మకమైన కాంబినేషన్‌లో హై యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇటీవలే చిత్ర యూనిట్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు, రిలీజ్ డేట్‌ను సైతం అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. దీన్ని 2026 జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక, తాజాగా షూట్‌పై ఓ న్యూస్ లీకైంది.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతుందట. అంతేకాదు, ఫస్ట్ షెడ్యూల్‌ను నల్ల సముద్రంపై ప్లాన్ చేశారని తెలిసింది. ఇందులో హీరోపై భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చేస్తారని సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సహా చిత్ర యూనిట్ ఆగ్నేయ ఐరోపా ఖండానికి వెళ్లబోతుందట. అక్కడ పలు దేశాల్లో షూట్ చేయబోతున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కలయికలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











