Just In
- 18 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
Don't Miss!
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
RRR రికార్డుల వేట మొదలు: తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇలా ఎప్పుడూ జరగలేదు.!
టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి.. ఇండస్ట్రీలోనే ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే RRR. ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు, బాహుబలి వంటి ప్రతిష్టాత్మక సిరీస్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతేకాదు, ఈ సినిమాను కూడా దాదాపు రూ. 400 కోట్లతో రూపొందిస్తుండడంతో అన్ని ఇండస్ట్రీల కళ్లు దీనిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో RRR గురించి ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త.? పూర్తి వివరాల్లోకి వెళితే...

వాళ్లందరి కలయికలో వస్తోంది
రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం RRR. ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. తారక్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరీస్ కథానాయికలుగా చేస్తున్నారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రే స్టీవెన్‌సన్, అలీసన్ డాడీ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

యూనిట్ ప్రకటనతో అనుమానాలు
కొద్ది రోజుల క్రితం ఈ చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా షూటింగ్ డెబ్బై శాతం పూర్తయిందని ప్రకటించింది. రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై ఏడాది గడిచినా అంతే చిత్రీకరణ అవడంతో.. సినిమా విడుదలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు, ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్ కూడా చిత్రీకరించాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది.

సరికొత్త న్యూస్ బయటకొచ్చింది
RRR షూటింగ్ చాలా వరకు బ్యాలెన్స్ ఉందన్న విషయం తెలిసినప్పటి నుంచి సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాను దక్షిణాది వాటితో పాటు ఇంగ్లీష్, హిందీ సహా మొత్తం పది భాషల్లో తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే సినిమా విడుదల కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ కూడా వినిపిస్తోంది.

రాజమౌళి నుంచి గిఫ్ట్ ఉంటుందా?
RRR ప్రాజెక్టు గురించి తెలిసి చాలా కాలం అయిపోయింది. అలాగే, సినిమా పూజా కార్యక్రమాలు, రెగ్యూలర్ షూటింగ్ మొదలై ఏడాది పైగా అయింది. అయినప్పటికీ ఈ సినిమా నుంచి ఒక్క లుక్‌గానీ, మరే ఇతర అప్‌డేట్స్ కానీ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ నుంచి ఏదైనా అప్‌డేట్ రావొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

RRR రికార్డుల వేట మొదలు
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా పశ్చిమ గోదావరి థియేట్రికల్ రైట్స్‌ను ఓ సంస్థ రూ. 13 కోట్లకు కొనగోలు చేసిందనేదే ఆ వార్త సారాంశం. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి చెందిన రైట్స్ ఇంత మొత్తానికి అమ్ముడైన దాఖలాలు లేవు.