For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR టీజర్‌కు డేట్ ఫిక్స్: ఆ స్పెషల్ డేన ఇద్దరు హీరోలు కలిసి.. పూనకాలు తెప్పించేలా మాస్టర్ ప్లాన్

  |

  దేశమే గర్వించదగ్గ దర్శకుడు రాజమౌళి.. టాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీలూ ఫోకస్ చేశాయి. అలాగే, సినీ ప్రియులంతా ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, ఇది అంతకంతకూ ఆలస్యం అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో RRR నుంచి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఓ స్పెషల్ డేన ఈ సినిమా టీజర్ విడుదల కాబోతుందట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

   రియల్ హీరోల కథతో వస్తున్న RRR

  రియల్ హీరోల కథతో వస్తున్న RRR

  ప్రజల్లో చైతన్యం కలిగించిన స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించే చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. భీంగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

  ఎప్పుడో మొదలు... మరింత ఆలస్యం

  ఎప్పుడో మొదలు... మరింత ఆలస్యం

  భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతోన్న RRR మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితమే మొదలైంది. అయినప్పటికి సినిమాకు సంబంధించిన చిత్రీకరణ భాగం మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. దీనికి కరోనా లాక్‌డౌన్‌తో పాటు పలు రకాల ఆటంకాలు ఎదురవడమే ప్రధానం కారణం. ఈ కారణంగానే ఈ సినిమా విడుదల కూడా రెండుసార్లు వాయిదా పడిపోయింది.

  ఈ సారి మారడంలేదు.. అందుకే అలా

  ఈ సారి మారడంలేదు.. అందుకే అలా

  RRRను 2020లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ఈ మధ్య విడుదల చేసిన ప్రతి పోస్టర్‌పై అదే డేట్‌ను చూపిస్తున్నారు.

  షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన యూనిట్

  షూటింగ్‌పై అప్‌డేట్ ఇచ్చిన యూనిట్

  కరోనా రెండో దశ ప్రభావం తగ్గడంతో RRR మూవీ షూటింగ్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. ఆ వెంటనే ఇటీవలే షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు హీరోలు బైక్‌పై వస్తున్న ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తైందని.. ఇద్దరు హీరోలు రెండు భాషలకు డబ్బింగ్ కూడా చెప్పేశారని అధికారికంగా వెల్లడించారు.

  RRR టీజర్‌కు డేట్ ఫిక్స్.. స్పెషల్ డేన

  RRR టీజర్‌కు డేట్ ఫిక్స్.. స్పెషల్ డేన

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRR మూవీ కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అలాగే, ఈ సినిమా నుంచి సాలిడ్ టీజర్ కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాన్ ఇండియా మూవీ టీజర్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వీడియో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల కాబోతుందట.

  పూనకాలు తెప్పించేలా అదిరిపోయే ప్లాన్

  పూనకాలు తెప్పించేలా అదిరిపోయే ప్లాన్

  ఇప్పటికే RRR మూవీ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ రెండు వీడియోలను విడుదల చేశారు. అయితే, త్వరలోనే విడుదల కానున్న టీజర్‌లో మాత్రం ఇద్దరూ హీరోలూ కలిసి కనిపిస్తారట. అంతేకాదు, వీళ్లిద్దరూ చెప్పే డైలాగులు అదిరిపోయేలా ఉంటాయని తెలిసింది. టీజర్‌తోనే పూనకాలు తెప్పించాలని పవర్‌ఫుల్‌ సీన్స్‌తో దీన్ని కట్ చేస్తున్నాడట జక్కన్న.

  English summary
  Tollywood Most Anticipated Movie RRR. Now This Film Shooting Completed Except for two songs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X