RRR తర్వాత మళ్లీ తారక్, చరణ్ జోడీ.. కథ రెడీ చేసిన బడా డైరెక్టర్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రెండు బడా ఫ్యామిలీలకు చెందిన వారైనప్పటికీ.. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ఈ ఇద్దరూ ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత వీళ్లిద్దరూ మరోసారి మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. అంతేకాదు, దానికి సంబంధించిన కథ కూడా సిద్ధం చేసేశాడట ఓ బడా డైరెక్టర్. ఆ సంగతులు మీకోసం.!

జూనియర్ ఎన్టీఆర్ ఇలా.. రామ్ చరణ్ అలా.!
నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘టెంపర్', ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చరణ్ మాత్రం ఆ మధ్య సక్సెస్‌లు సాధించినప్పటికీ గత ఏడాది వచ్చిన ‘వినయ విధేయ రామ'తో బాగా డీలా పడిపోయాడు.

జక్కన్న కలిపాడు ఈ ఇద్దరు స్టార్ హీరోలను
‘బాహుబలి' వంటి బడా ప్రాజెక్టు తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కథల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో ఆలియా, ఒలీవియో హీరోయిన్లు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ లిస్టు చాలా పెద్దదే సుమా
ప్రతిష్టాత్మక చిత్రం RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించే మూవీలో నటిస్తాడు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఆ తర్వాత కూడా అతడు పని చేసే దర్శకుల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. పక్క పరిశ్రమలకు చెందిన ప్రశాంత్ నీల్, అట్లీతో పాటు కొరటాల శివ, తరుణ్ భాస్కర్ సహా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.

చరణ్ ఫైనల్ చేయలేదు.. అప్పటి వరకు ఇలా
తారక్ మాత్రం ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించగా... రామ్ చరణ్ మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి చెర్రీ పలానా దర్శకుడితో సినిమా చేస్తున్నాడని ఎంతో మంది పేర్లు బయటకు వచ్చినా.. క్లారిటీ మాత్రం రాలేదు. అయితే, తన తండ్రి నటిస్తున్న ‘ఆచార్య'లో మాత్రం అతడు కీలక పాత్ర చేస్తున్నాడు. అంతేకాదు, దానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.

RRR తర్వాత మరోసారి తారక్, చరణ్ జోడీ
రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR 2021 జనవరి 8న విడుదల కాబోతుంది. దీని తర్వాత తారక్ సినిమా ప్రారంభం అవుతుంది. అలాగే, చరణ్ కూడా ఈ మధ్యలోనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించబోతున్నాడు. ఇలా 2021లో చెరో సినిమా చేసిన తర్వాత.. వీళ్లిద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారని తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
Recommended Video

కథ రెడీ చేసిన బడా డైరెక్టర్.. హీరోలు సై
RRRతో రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుండడంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వీళ్లిద్దరినీ దృష్టిలో ఉంచుకుని ఓ కథ రాశాడని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి ఇద్దరు హీరోలూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. 2022లో ప్రారంభం అయ్యే ఈ మూవీని రెండు బడా సంస్థలు నిర్మిస్తాయని ప్రచారం జరుగుతోంది. దీన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











