twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ నెక్ట్స్ వివరాలు లీక్: మరోసారి అదే సెంటిమెంట్‌తో టైటిల్.. అధికారికంగా ప్రకటించేది అప్పుడే.!

    By Manoj Kumar P
    |

    జూనియర్ ఎన్టీఆర్... తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకడు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ దూసుకుపోతున్నాడీ యంగ్ టైగర్. కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటున్న తారక్.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత అతడు చేయబోయే సినిమా గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ డీటేల్స్ లీక్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...

    ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు

    ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు

    జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అతడు తెలంగాణ వీరుడు కొమరం భీం పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలు. అలాగే పలువురు సీనియర్ యాక్టర్లు కీలక పాత్రలు చేస్తున్నారు.

    ఎన్టీఆర్‌ లుక్‌ లీక్.. ఎలా ఉందంటే

    ఎన్టీఆర్‌ లుక్‌ లీక్.. ఎలా ఉందంటే

    ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్పాట్‌లోని వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఇందులో ఎన్టీఆర్.. కొమరం భీం పాత్రలో డైలాగులు చెబుతూ కనిపించాడు. అలాగే, ఇటీవల తారక్ ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. వీటికి నందమూరి ఫ్యాన్స్‌‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

    తారక్ తర్వాతి సినిమా ఎవరితో.?

    తారక్ తర్వాతి సినిమా ఎవరితో.?

    RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్న విషయంపై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో తమిళ డైరెక్టర్ అట్లీ, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరితో పాటు తెలుగు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ పేర్లు కూడా అనుకున్నారు.

    ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ వివరాలు లీక్

    ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ వివరాలు లీక్

    తాజాగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే తర్వాతి సినిమా గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. దీని ప్రకారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడట. హారిక హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించే ఈ భారీ ప్రాజెక్టులో రష్మిక మందన్నా హీరోయిన్ అని అంటున్నారు. అలాగే, థమన్ సంగీతం సమకూర్చనున్నాడట.

    మరోసారి అదే సెంటిమెంట్‌తో టైటిల్

    మరోసారి అదే సెంటిమెంట్‌తో టైటిల్

    ‘అల.. వైకుంఠపురములో' ఇచ్చిన సక్సెస్‌తో జోష్ మీద ఉన్నాడు త్రివిక్రమ్. ఈ క్రమంలోనే అతడు తన తర్వాతి సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడట. ఇందులో భాగంగానే తారక్‌తో చేయబోయే చిత్రానికి ‘అయిననూ పోయిరావలె.. హస్తినకు' అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడని సమాచారం. త్రివిక్రమ్‌కు ‘అ' అనేది అచ్చొచ్చింది. ఆ సెంటిమెంట్‌తోనే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని టాక్.

    అధికారికంగా ప్రకటించేది అప్పుడే.!

    అధికారికంగా ప్రకటించేది అప్పుడే.!

    ప్రస్తుతం తారక్ RRR షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో త్రివిక్రమ్ కూడా కొత్త సినిమా స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడు. ఈ రెండు పూర్తవక ముందే కొత్త సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడించబోతున్నారని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఫిబ్రవరి మొదటి వారంలో వెల్లడిస్తారని సమాచారం.

    English summary
    Tollywood Young Hero Jr Ntr Busy with RRR Shooting. This movie Directed by SS Rajamouli. in This movie Mega power star Ram charan also Working. After This Ntr Will Work With Trivikram Srinivas Again.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X