తారకరత్నపై జూ ఎన్టీఆర్ సీరియస్!?
నందమూరి తారకరత్న పై జూ.ఎన్టీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడతోంది. దానికి కారణం తారకరత్న తన పేరు అయిన ఎన్టీఆర్,తారక్ లను ఉపయోగించుకుని పబ్లిసిటీకి దిగటమేనని చెప్తున్నారు. నందమూరి తారక రత్న తాజా చిత్రం నందీశ్వరుడు కోసం తన పేరులోని మొదట అక్షరాలను ఉపయోగిస్తూ ఎన్ టి ఆర్ అని మార్చుకున్నారు. అలాగే తారకరత్న లోని తారక్ ని కూడా ఉపయోగిస్తున్నారు. ఇది జూ ఎన్టీఆర్ ని ఇబ్బందుల్లో పడేసింది. మీడియాలో సైతం ఎన్టీఆర్ చిత్రం నందీశ్వరుడు,తారక్ కొత్త చిత్రం నందీశ్వరుడు అని పబ్లిసిటీ చేస్తున్నారు.
ఎన్టీఆర్ చిత్రం సంక్రాంతి విడుదల వంటివి తన అభిమానులను కన్ఫూజన్ లో పడేస్తాయని జూ.ఎన్టీఆర్ భావించి చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఎలా ఈ విషయాన్ని తారకరత్నకు తెలియచెప్పాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ పేరు విషయంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని తన సన్నిహితులను కంగారుపడవద్దని జూనియర్ ఆదేశించినట్లుగా సమాచారం. ఇక అంజి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న నందీశ్వరుడు చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. సింహా తరహా మీసంతో ఇందులో తారకరత్న కనిపించనున్నారు. కన్నడ చిత్రం డెడ్లీ సోమా ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.


Click it and Unblock the Notifications











