చీప్ ట్రిక్స్ ప్లే చేయ్యొద్దని ఆ టీ.వి ఛానల్ కి క్లాస్ పీకిన జూ ఎన్టీఆర్...!?
మూడు రోజుల క్రితం ఎన్టీఆర్ యాక్సిడెంట్ లో స్వల్సంగా గాయపడ్డాడు. అయితే దీనికి న్యూస్ ఛానల్స్ చాలా హడావిడి చేశాయి. న్యూస్ ఛానల్స్ చూపించిన అత్యుత్సాహానికి ఎన్టీఆర్ చాలా సీరియస్ అయినట్టు తెలిసింది. ఎన్టీఆర్ వివాహమాడబోయే లక్ష్మీప్రణతి జాతకం బాగుండకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ఛానల్స్ లో చెప్పుకొచ్చారు. దీంతో ఆ ఛానల్ కి సంబంధించిన వారిని పిలిచి వారి మీద సీరియస్ అయ్యాడు.
లక్ష్మీ ప్రణతితో యంగేజ్ మెంట్ కాకముందు యాక్సిడెంట్ అయింది అందుకు మేజర్ గా దెబ్బలు తగిలాయి. అయితే యంగేజ్ మెంట్ తర్వాత లక్ష్మీ ప్రణతి జాతకం మంచిది కావడం వల్లే స్వల్స గాయాలతో బయటపడ్డానని, చిన్న విషయాల్ని కూడా పెద్దదిగా చూపించడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయొద్దని ఆ ఛానల్ ని హెచ్చరించినట్టు తెలిసింది. ఈ విషయంలో ప్రణతి కూడా ఎన్టీఆర్ నే సపోర్ట్ చెయ్యడం ఇక్కడ గమనించాల్సిన విషయం.


Click it and Unblock the Notifications











