మరో అగ్ర దర్శకుడితో ఎన్టీఆర్ చర్చలు.. అన్నయ్య ప్రొడక్షన్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలు భాషతో సంబంధం లేకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా క్రేజ్ అందుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీలలోని అగ్ర దర్శకులతో వర్క్ చేయడానికి రెడీ అంటున్నాడు. త్వరలోనే ఒక తమిళ స్టార్ దర్శకుడితో కూడా ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్ట్ ను తన అన్నయ్య కళ్యాణ్ రామ్ హోమ్ బ్యానర్ లోనే రూపొందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

బిగ్గెస్ట్ సక్సెస్

బిగ్గెస్ట్ సక్సెస్

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల కాలంలో ఇలాంటి సినిమా కథను సెలెక్ట్ చేసుకున్న కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాక్సాఫీస్ వద్ద అయితే అతని మార్కెట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇటీవల మొత్తానికి RRR సినిమాతో ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 ఆ సినిమాతో బిజీగా..

ఆ సినిమాతో బిజీగా..

RRR సినిమా సక్సెస్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను కూడా అంతకుమించి అనేలా తెరకెక్కించాలి అని ప్రస్తుతం కొంతమంది దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా సరికొత్త పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా

మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా

అలాగే ఎన్టీఆర్ లిస్టులో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నిల్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆ దర్శకుడు సలార్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా ముగిసిన అనంతరం ఎన్టీఆర్ తో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేయనున్నాడు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని ఎన్టీఆర్ కథ విషయంలో చర్చలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

తమిళ దర్శకుడితో..

తమిళ దర్శకుడితో..

ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల విషయంపై ఈనెల 25వ తేదీన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి భవిష్యత్తు ప్రాజెక్టులపై కీలకమైన అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక తమిళ దర్శకుడితో కూడా ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కళ్యాణ్ రామ్ నిర్మాతగా..

కళ్యాణ్ రామ్ నిర్మాతగా..

ఆ తమిళ దర్శకుడు మరెవరో కాదు. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకు వస్తున్న శంకర్ అని తెలుస్తోంది. శంకర్ గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కానీ ఈసారి అతను ఎలాగైనా RC16 ప్రాజెక్ట్ తో మంచి విజయాన్ని అందుకోవాలని అలాగే ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఆ ప్రాజెక్టును కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే నిర్మించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరి కలయికలో వచ్చే సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X