మెగా ప్రొడ్యూసర్ తో jr ఎన్టీఆర్ పాన్ ఇండియా.. దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలను మొదలుపెట్టిన తర్వాత అన్ని రకాల సినిమాలను చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక దర్శకులను సెలెక్ట్ చేసుకునే విధానంలో కూడా వారి ఆలోచన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఒక సరికొత్త కాంబినేషన్ కు శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా మెగా కాంపౌండ్ లో ఉండే నిర్మాత తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.. ఆ వివరాల్లోకి వెళితే..

మొదటిసారి వారి కలయికలో
మెగా నందమూరి కలయికలో సినిమా వస్తే చాలా బాగుంటుంది అని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇక వారి కోరికను దర్శకుడు రాజమౌళి నెరవేర్చని విషయం తెలిసిందే. రామ్ చరణ్ తో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి చేసిన RRR సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

త్వరలోనే లాంచ్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కూడా RRR సినిమా తరువాత అదే తరహాలో కొనసాగాలని అనుకుంటున్నాడు.. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను మొదలు పెట్టేందుకు ఎన్టీఆర్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఆ సినిమాను త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు.

ఉప్పెన దర్శకుడితో కూడా
కొరటాల శివ ప్రాజెక్టు అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో కూడా మరో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ సినిమాపై ఇంకా అఫీషియల్ గా ఇలాంటి క్లారిటీ రావట్లేదు.

మెగా ప్రొడ్యూసర్ తో..
అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ మరొక స్టార్ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక ఆ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో నిర్మించబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ఇతర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆలోచిస్తోంది. ఇక త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా అగ్రిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

దర్శకుడు ఎవరంటే?
ఇక ఎన్టీఆర్ గీత ఆర్ట్స్ కాంబినేషన్లో రాబోయే సినిమా దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. గీత గోవిందం సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న పరశురామ్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ దర్శకుడు మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పరశురామ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ కథను చెప్పినట్లుగా తెలుస్తోంది.. అయితే ఆ కథ ఎన్టీఆర్ కు కరెక్ట్ గా సరిపోతుందని అల్లు అర్జున్ కూడా సలహా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దర్శకుడు కథ చెప్పే అవకాశం ఉందట. మరి ఎన్టీఆర్ ఎంతవరకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











