ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథ సెట్ చేసిన మహర్షి దర్శకుడు.. ఆ సినిమాకి సీక్వెల్?
మహర్షి సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. అయితే ఆ సినిమా సక్సెస్ వల్ల దర్శకుడికి అనుకున్నంతగా గుర్తింపు అయితే దక్కలేదు. స్టార్ హీరోలతో చనువుగా ఉండే వంశీ.. కథ చెబితే ఏ హీరో అయినా సినిమా చేస్తారనేది మొన్నటి వరకు ఒక టాక్ నడిచింది. అలాగే ఆయన నెక్స్ట్ సినిమా కూడా మళ్ళీ మహేష్ బాబుతోనే ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.
కానీ మహేష్ ఎందుకో కథ నచ్చక మళ్ళీ మనసు మార్చుకున్నాడని టాక్ వచ్చింది. ఆ సంగతి పక్కన పెడితే.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఇప్పుడు ఎన్టీఆర్ కోసం ఒక కథ సెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన బృందావనం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అదే సినిమాకు వంశీ పైడిపల్లి సీక్వెల్ ని సిద్ధం చేసినట్లు సమాచారం.

ఎలాగైనా నెక్స్ట్ సినిమాను మహేష్ బాబుతోనే చేయాలని అనుకుంటున్న వంశీ ఆ తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం లాక్ డౌన్ లో బృందావనం సీక్వెల్ కథకు ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఆ సినిమా రూపొందే ఛాన్స్ ఉన్నట్లు స్సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ RRR తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాతో బిజీ కానున్నాడు తారక్. మరి వంశీ పైడిపల్లి సీక్వెల్ కథకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











