'దూకుడు' గురించే ఎన్టీఆర్ (ఇన్ సైడ్ టాక్)

By Srikanya

ఇప్పుడు ఎన్టీఆర్ దృష్టి మొత్తం దమ్ము చిత్రంపైనే ఉంది. అయితే అతని ఆలోచన మాత్రం దూకుడు కలెక్షన్స్ పైనే ఉంది. ఊసరవెల్లితో దూకుడుకి పోటీ ఇద్దామనుకున్నాడు. కానీ తను ఫెయిల్ అవటంతో ఎలాగైనా తన దమ్ము చిత్రంతో తన దమ్ము ఎలాగైనా చూపి దూకుడు రికార్డులు బ్రద్దలు కొట్టాలనేది తన కోరికగా చెప్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇది ఓ రకంగా ఎన్టీఆర్ అభిమానులకు సంతోషం కలిగించే విషయం. ఎందుకంటే యావరేజ్ లతో వెళ్తున్న ఎన్టీఆర్ కెరీర్ లో మళ్లీ సింహాద్రి రేంజి హిట్ రావాలని వాళ్లంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

బృందావనం, అదుర్స్ చిత్రాలు హిట్ అయినా సెన్సేషనల్ హిట్స్ గా నమోదు కాలేదు. ఈ నేపధ్యంలో సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం అనగానే వారిలో చాలా అంచనాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ సైతం సన్నబడి ఈ చిత్రంలో డాన్స్ లు, పైట్స్ తో అదరకొట్టడానకి రెడీ అవుతున్నారు. త్రిష, కార్తీక నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోలీస్ గా కనిపించనున్నారని సమాచారం. ఇక బోయపాటి సైతం ఈ ప్రాజెక్టుని ఓ సవాల్ గా భావించి అన్ని జాగ్రత్తలు తీసుకుని తీర్చిదిద్దుతున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రం ఉన్న రికార్డుల బ్రద్దలు కొట్టడమే కాక కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని కృషి చేస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఎన్టీఆర్ సైతం ఎలాంటి రిస్క్ కైనా సిద్దం అన్నట్లుగా ఫైట్స్ , పాటలలో చెలరేగిపోతున్నాడని వినపడుతోంది. మొత్తానికి దూకుడు ..ఎన్టీఆర్ లో ఉత్సాహాన్నే కాక ప్రేరణనని కలిగించిందన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X