Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బ్రహ్మీతో పోటీనా నో ఛాన్స్: జూ ఎన్టీఆర్
సంక్రాంతి పండుగకు విడుదలైన 'అదుర్స్", 'నమో వెంకటేశ" సినిమాలు చూస్తే బ్రహ్మీనందం ఎంతటి మెయిన్ రోల్ పోషించాడో అర్థమవుతోంది. ఈ రెండు సినిమాలే కాదు పోయిన యేడాది కోట్ల బడ్జెట్ తో చేసిన సినిమాల్లో ఎక్కువగా బ్రహ్మానందం పాలుపంచుకున్నవే. హీరోలు ఉన్నప్పటికీ బ్రహ్మీ పాత్రకు మాంచి స్పందన లభిస్తోంది.
కామెడీలో బ్రహ్మానందంతో పోటీ పడలేనంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 'అదుర్స్" సినిమాలో బ్రహ్మానందంతో వర్క్ ఎక్స్పీరియన్స్ అధ్బుతంగా వుందంటోన్న జూనియర్, గతంలో బ్రహ్మీతో చాలా సినిమాల్లో వర్క్ చేసినా, 'అదుర్స్" లో తమ కాంబినేషన్ అదుర్స్ అని చెప్పుకొచ్చాడు సినిమా సక్సెస్ మీట్ లో. బ్రహ్మానందం, ఎన్టీఆర్ ఒకరితో ఒకరు పోటి పడి నటించారు" అంటూ దర్శకుడు వినాయక్ అనడంతో, పక్కనే వున్న ఎన్టీఆర్, 'బ్రహ్మీనందంతో కామెడీలో పోటీ పడలేను ఆయన కామెడీకి కేరాఫ్ అడ్రస్" అంటూ బ్రహ్మీని ఆకాశానికెత్తేశాడు.
ఛారి గెటఫ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపోయాడనీ, అచ్చమైన బ్రాహ్మణ యువకుడిగా ఎన్టీఆర్ ఆహార్యం అత్యధ్బుతమనీ బ్రహ్మీ కితాబులిచ్చాడు జూనియర్ కి తెలుగు సినీ పరిశ్రమలో చారి పాత్రకి ఇంకొకర్ని ఊహించుకోలేనని అంటున్నారు వినాయక్. మరో రెండు వారాల్లోనే ఆల్ టైమ్ రికార్డుల్ని 'అదుర్స్" అధిగమిస్తుందని వినాయక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.